Champions Trophy 2025: వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై ఉత్కంఠ కొనసాగుతుంది. పాక్ లో పర్యటించే ప్రసక్తి లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. మరోవైపు హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోవాలని పాకిస్థాన్‌పై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ఈ అంశంపై మాజీ క్రికెటర్ మదన్‌లాల్ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు బంతి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోర్టులోనే ఉంది.. పీసీబీనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
Read Also: Tripti Dimri : బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతోన్న త్రిప్తి
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై బీసీసీఐ ఇప్పటికే తన వైఖరిని స్పష్టంగా చెప్పిందని మదన్ లాల్ తెలిపారు. హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలా.. వద్దా.. అనేది పాకిస్థానే నిర్ణయించుకోవాలన్నారు. క్రికెట్ కొనసాగాలంటే.. వారు ఆడాలని నేను అనుకుంటున్నాను.. దాని వల్ల పాకిస్థాన్ ప్రయోజనాలు పొందుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై పీసీబీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని మాజీ క్రికెటర్ మదన్‌లాల్ పేర్కొన్నారు.
Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా ఎప్పుడో తెలుసా? ఈ సారి భక్తులకు కొత్త సౌకర్యాలు
ఇక, 2025లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధతకు తెరదించేలా ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. భారత మ్యాచ్‌లకు వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేసిందని అనేక కథనాలు వస్తున్నాయి. అలాగే 2027 వరకు జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ పాక్ టీమ్ ఆడే మ్యాచులను కూడా హైబ్రిడ్ విధానంలో కొనసాగించేందుకు ఐసీసీ ఒప్పకున్నట్లు సమాచారం.
Read Also: TG Govt GO: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై రేవంత్ సర్కార్ జీవో..
అయితే, ఐసీసీ ఛైర్మన్ జై షా, బోర్డు సభ్యుల మధ్య గురువారం జరిగిన అనధికార భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా.. టీమిండియాను పాక్‌కు పంపేదే లేదని భారత సర్కార్ స్పష్టం చేసింది. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీపై పీసీబీ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. దీంతో షెడ్యూల్ వెల్లడి వరుసగా వాయిదా పడుతుంది.
Read Also: MLC Election Results: పీడీఎఫ్ అభ్యర్థి ఘన విజయం.. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు..!
మరోవైపు వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 మెన్స్ టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంకతో కలిసి ఉమ్మడిగా భారత్ నిర్వహించబోతుంది. ఒక వేళ ఇండియాలోనూ హైబ్రిడ్ మోడల్ కొనసాగిస్తే.. పాక్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై జరపనున్నారు.