Site icon NTV Telugu

Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్టుకు రంగం సిద్ధం

Imran Khan

Imran Khan

Imran Khan Arrest : పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తాజాగా స్థానిక న్యూస్ మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని బనిగల నివాసంలో అతన్ని గృహనిర్బంధంలో ఉంచడానికి పాక్ ప్రభుత్వం పోలీసులకు అనుమతి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. విదేశీ నిధుల కేసుకు సంబంధించి ఖాన్‌ను హౌస్ అరెస్టు చేయడానికి పాక్ పోలీసులు రెడీ అవుతున్నారని మీడియా పేర్కొంది. ఇప్పటికే పీటీఐ నాయకులు తారిఖ్ షఫీ, హమీద్ జమాన్, సైఫ్ నియాజీలను పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) అరెస్టు చేశారు.

జాతీయ అసెంబ్లీని రద్దు చేసి దేశంలో ఎన్నికలను ప్రకటించేలా ఒత్తిడి చేసేందుకు మరో మెగా నిరసనకు సిద్ధం కావాలని ఇమ్రాన్ ఖాన్ సోమవారం తన పార్టీ కార్యకర్తలను కోరారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాలక సంకీర్ణ ప్రభుత్వాన్ని తొలగించే లక్ష్యంతో ఈ మార్చ్ ఈ వారంలోనే స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలోనే “ఆజాదీ మార్చ్” కంటే ముందు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గృహనిర్బంధంలో ఉంచడానికి పాక్‌ గవర్నమెంట్ సమాయత్తమవుతోంది. ప్రభుత్వం మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డినెన్స్ కింద ఖాన్‌ను అదుపులోకి తీసుకోవచ్చని సమాచారం.

Read Also: Explosion On Bridge: ఉక్రెయిన్ పై విధ్వంసానికి దిగిన రష్యా.. బ్రిడ్జిని పేల్చేసిన సైన్యం

ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు చేయాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఒక మీడియా రిపోర్ట్ తెలిపింది. అనధికారంగా వెబ్ సైట్ నిర్వహిస్తు విదేశాలనుంచి నిధులు సమకూర్చకున్నారనే ఆరోపణలతో మొదట పీటీఐ నేత సైపుల్లా నియాజిని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైబర్ క్రైం విభాగం శుక్రవారం అరెస్ట్ చేసింది. ఈ అరెస్టు నివేదికలపై పీటీఐ నాయకుడు ఫవాద్ హుస్సేన్ చౌదరి స్పందించారు. పాలక ప్రభుత్వం “ఆజాదీ మార్చ్” పట్ల భయాందోళనలకు గురవుతోందని అన్నారు.

Exit mobile version