Rape Case: ఒక క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు నమోదు అయ్యింది. ఇంతకీ ఈ కేసు ఎక్కడ నమోదు అయ్యిందో తెలుసా.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో. పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ కుమారుడిపై బార్కి పోలీస్ స్టేషన్ ఈ కేసు నమోదు చేశారు. పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పోలీసులు ఈ మాజీ క్రికెటర్ కుమారుడిని అరెస్టు చేశారు. ఈ మాజీ క్రికెటర్ ఇంట్లో బాధితురాలు పని మనిషిగా చేస్తుంది.
READ ALSO: Pradosha Vratam : మహాశివరాత్రికి ముందే అద్భుత అవకాశం.! ఈ శని ప్రదోషం రోజున ఇది చేస్తే చాలు.!
పాకిస్థాన్ వార్తాపత్రిక డాన్ నివేదిక ప్రకారం.. జనవరి 23న బాధితురాలు బార్కి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు తనకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని కోరినట్లు బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. నిందితుడు తన కారులో వాళ్ల ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లాడని, అక్కడ తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత ఆమె ఈ సంఘటనపై బార్కి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి అత్యాచారం కేసు నమోదు చేసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడికి, ఫిర్యాదు చేసిన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ కుమారుడని వెల్లడించాడు.
READ ALSO: Ravi Teja: ఇరుముడి సెట్స్‌లో మాస్ మహారాజా బర్త్‌డే బ్లాస్ట్..
