Site icon NTV Telugu

Indian Army : పాకిస్తాన్‌ దాడిపై భారత ఆర్మీ కీలక ప్రకటన

Army

Army

Indian Army : పాకిస్తాన్‌ నిన్న రాత్రి డ్రోన్‌ దాడులపై భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాక్‌ డ్రోన్లు భారత భూభాగంలోకి చొరబాటుకు యత్నించాయని, కొన్ని ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని పలు సున్నిత ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పాక్‌ కుట్రలను ముందుగానే గుర్తించిన భారత భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. LOC వెంబడి పాక్‌ డ్రోన్ల కదలికలను గుర్తించిన వెంటనే వాటిపై పోరాట చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలు డ్రోన్లను నేలమట్టం చేశామని ఇండియన్‌ ఆర్మీ పేర్కొంది.

India Pak War : మరో మహా భారతం..!

“పాకిస్తాన్‌ కుట్రలన్నింటికీ భారత్‌ తగినదైన, ధీటైన ప్రత్యుత్తరం ఇస్తోంది. సార్వభౌమత్వాన్ని కాపాడడంలో మనకు ఏమాత్రం వెనుకడుగు లేదు. దేశ భద్రత కోసం మేము నిరంతరం సిద్ధంగా ఉన్నాము” అని భారత ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం ఇప్పటికే పాక్‌ను పలుమార్లు హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటే, దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా పాక్‌ చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చ నడుస్తోంది.

Samba : సాంబా సెక్టార్‌లో ఉగ్ర కుట్ర.. 10 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతం

Exit mobile version