Site icon NTV Telugu

Pakistan Cricket: పాక్ క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సర్జరీ.. ఈ స్టార్ల కెరీర్ ఇక ముగిసినట్టేనా?

Pakistan

Pakistan

Pakistan Cricket: 2026 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర ప్రదర్శన ఆ దేశ క్రికెట్‌లో పెను మార్పులకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టోర్నీలో జట్టు వైఫల్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కన్నెర్ర చేయడంతో, కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మార్చి 2025లో మహ్మద్ రిజ్వాన్ స్థానంలో టీ20 సారథిగా పగ్గాలు చేపట్టిన సల్మాన్ అలీ అఘా, ఈ మెగా టోర్నీలో జట్టును నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం పాక్ జట్టు సూపర్-8 దశలోనే ఇంటిముఖం పట్టే పరిస్థితి నెలకొంది. శ్రీలంకపై గెలిచినా సెమీస్ చేరడం గగనమే కావడంతో పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే పాక్.. క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సర్జరీ చేయబోతుందని, దీంతో బాబర్, ఆఘా సహా పలువురు స్టార్లపై వేటుపడే ఛాన్స్ ఉందని సమాచారం. ఇంతకీ వాళ్లు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Israel-Iran War: భయం గుప్పిట ‘‘గల్ఫ్ బతుకులు’’.. ఎంత మంది భారతీయులు ఉన్నారంటే..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వరల్డ్ కప్ ముగియగానే పాక్ జట్టులో భారీ ప్రక్షాళన జరగనుంది. సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉందని సమాచారం. టీ20ల్లో పాక్ తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు బాబర్ అజామ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్న ఈ స్టార్ బ్యాటర్‌ను కూడా పక్కన పెట్టాలని బోర్డు భావిస్తోందని తెలుస్తుంది. అలాగే ఉస్మాన్ ఖాన్‌తో పాటు మరికొందరు సీనియర్లకు ఇది చివరి టీ20 టోర్నీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. నిర్భయంగా ఆడే యువ రక్తాన్ని జట్టులోకి ఆహ్వానించాలని, పాతతరం ఆటగాళ్లకు స్వస్తి పలకాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త కెప్టెన్ రేసులో ఆ ఇద్దరు..
సల్మాన్ అఘా తర్వాత జట్టును నడిపించే బాధ్యతను ఎవరికి అప్పగించాలనే దానిపై కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆ రేసులో ఇద్దరు ఆటగాళ్లు ముందున్నారు. మొదటి వ్యక్తి షాదాబ్ ఖాన్. గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉండటం ఇతనికి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. రెండోవ వ్యక్తి.. షాహీన్ షా అఫ్రిది. పాక్ స్టార్ పేసర్ షాహీన్‌కు పగ్గాలు ఇచ్చే ఆలోచనలో బోర్డు ఉందని తాజా సమాచారం. గత ఏడాది కాలంగా వీరిద్దరినీ జట్టు మేనేజ్‌మెంట్ కొంతవరకు పక్కన పెట్టినప్పటికీ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో అనుభవం ఉన్న వీరివైపే పీసీబీ మొగ్గు చూపుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Gold and Silver Prices: ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో కొండెక్కుతున్న బంగారం, వెండి ధరలు!

Exit mobile version