కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడ్డాయనుకున్న వేళ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహల్గామ్ లో టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అధికార వర్గాల ప్రకారం 28 మందిని పొట్టనబెట్టుకున్నారు. ముష్కరుల కాల్పులతో దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగింది. అక్కడి స్థానికులు భయంతో వణికిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి రోధనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఉగ్రదాడిని ట్రంప్ తో సహా ప్రపంచ ప్రముఖులు ఖండించారు. ఉగ్రవాదుల దాడులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో భారీగా బలగాలను…