NTV Telugu Site icon

China-Pakistan: చైనాకు పాకిస్థాన్ భారీ గిఫ్ట్..

China Pakistan

China Pakistan

చైనా ప్రధాని లీ కియాంగ్‌కు పాకిస్థాన్ కొత్త గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం, చైనా ఇంజనీర్లను చంపిన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్‌కు రాకముందే జైలుకు తరలించే పేరుతో..పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సినిమా శైలిలో వారిని హతమార్చింది. అయితే వారితో పాటు ప్రయాణిస్తున్న ఇతర జైలు వ్యాన్‌లో కూర్చున్న పోలీసు అధికారులు, ఇతర ఉగ్రవాదులందరూ దాడి నుంచి బయటపడ్డారు. జూలై 14, 2021న పాకిస్థాన్‌లోని దాసులో చైనా ఇంజనీర్లతో నిండిన బస్సుపై టెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాదులు భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

READ MORE: Maharashtra: ‘‘మహాయుతి’’లో లుకలుకలు.. కేబినెట్ నిర్ణయాలపై అజిత్ పవార్ అసంతృప్తి..

ఈ ఆత్మాహుతి దాడిలో నలుగురు చైనీస్ ఇంజనీర్లు సహా 12 మంది చనిపోయారు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్‌పై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైనా వ్యతిరేకతకు భయపడి, పాక్ పరిపాలన ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ముహమ్మద్ హుస్సేన్, అతని సహచరుడు, అయాజ్ అలియాస్ జహాంజేబ్‌ను అరెస్ట్ చేసింది. విచారణ జరిపింది. 2022లో కోర్టు వారిద్దరికీ మరణశిక్ష విధించింది. అరెస్టు చేసిన తర్వాత ఈ ఇద్దరు ఉగ్రవాదులను వేర్వేరు జైళ్లలో ఉంచారు.

READ MORE: Lucky Baskhar: అక్టోబర్ 30 నుంచి ‘లక్కీ భాస్కర్’ ప్రీమియర్ షోలు

తాజా పరిణామాల ప్రకారం ఈ ఇద్దరు ఉగ్రవాదులను ఈ ఉదయం సాహివాల్‌లోని హై సెక్యూరిటీ జైలుకు తరలించారు. వీరితో పాటు మరికొందరు ఉగ్రవాదులు, పోలీసు బందోబస్తును కూడా జైలు వ్యాన్‌లో మోహరించారు. పాకిస్థాన్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ జైలు వ్యాన్‌పై ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో చైనా ఇంజనీర్లను హతమార్చిన ఉగ్రవాదులిద్దరూ హతమయ్యారు. కాగా..వారితో పాటు ప్రయాణిస్తున్న ఇతర జైలు వ్యాన్‌లో కూర్చున్న ఇతర ఉగ్రవాదులు, పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదు. దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కానీ ఇది పాక్ చైనాకు ఇచ్చిన గిఫ్ట్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు.