Asim Munir: పాకిస్థాన్‌లో సైన్యం ప్రభావం కొత్త దశలోకి ప్రవేశించింది. ఇటీవల అమలులోకి వచ్చిన 27వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. పాకిస్థాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF) గా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ గురువారం నియమితులయ్యారు. దీంతో మునీర్ ఇప్పుడు మూడు సేవలకు సుప్రీం కమాండర్ అయ్యాడు. సైన్యం, వైమానిక దళం, నౌకాదళానికి ఆయనే అధినేత. ఆయన ఈ పోస్ట్‌లో ఐదు సంవత్సరాలు ఉండనున్నారు. ఈ సవరణ తర్వాత ఛైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (CJCSC) పదవి రద్దు చేశారు.
READ ALSO: WPL 2026 Unsold Players: అయ్యబాబోయ్.. అన్‌సోల్డ్ లిస్ట్ పెద్దదే సుమీ..!
సీడీఎఫ్ పాత్ర పాకిస్థాన్‌లో 1976 నుంచి ఉంది, కానీ ప్రస్తుత CJCSC జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా పదవీ విరమణతో ఈ పదవి రద్దు చేశారు. 240 మిలియన్ల జనాభా, అణుశక్తి కలిగిన పాకిస్థాన్, చాలా కాలంగా పౌర, సైనిక పాలన మధ్య ఊగిసలాడుతోంది. జనరల్ పర్వేజ్ ముషారఫ్ చివరిసారిగా 1999లో అధికారాన్ని చేజిక్కించుకుని బహిరంగ సైనిక పాలనను స్థాపించారు. ఆ తర్వాత డెమోక్రటిక్ ప్రభుత్వాలు వచ్చాయి, కానీ దేశంలో సైన్యం ప్రభావం బలంగానే ఉంది. కొత్త సవరణలు బంగారు మార్కెట్‌ను మరింత బలోపేతం చేశాయి.
మునీర్ చేతుల్లోకి అణు నియంత్రణ..
ఇప్పుడు అణ్వాయుధాల నియంత్రణ కూడా నేరుగా CDF యామి అసిమ్ మునీర్ నియంత్రణలో ఉండనుంది. గతంలో ఈ అధికారం అధ్యక్షుడు, క్యాబినెట్‌తో ఉండేది. కానీ ఇప్పుడు అణు నియంత్రణ మునీర్ చేతుల్లోకి వచ్చింది. ఈ మార్పు మునీర్ పదవీకాలాన్ని కూడా పొడిగించింది. ఆయన మొదట నవంబర్ 27, 2027న పదవీ విరమణ చేయాల్సి ఉంది, కానీ ఇప్పుడు ఆయన 2030 వరకు తన కొత్త పదవిలో ఉంటాడు.
ఈ సవరణ తర్వాత, మునీర్‌కు రాష్ట్రపతికి ఉన్నట్లే జీవితాంతం చట్టపరమైన రక్షణ లభించింది. అంటే ఆయనపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేరు. దేశంలో ఈ రక్షణను వైమానిక దళం, నేవీ చీఫ్‌లకు కూడా విస్తరించారు. ఇప్పుడు CDF ప్రభుత్వానికి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (VCOAS) నియామకాన్ని సిఫార్సు చేసే అధికారం కూడా ఉంటుంది. ఈ సిఫార్సును ప్రభుత్వం ఆమోదిస్తుంది. గతంలో ఇది పూర్తిగా పౌర ప్రభుత్వం బాధ్యతగా ఉండేది. అలాగే న్యూక్లియర్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతి నియామకంలో కూడా సైన్యం పాత్ర పెరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం CDF సలహా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది . మునీర్ నవంబర్ 2022లో ఆర్మీ చీఫ్ అయ్యాడు. దీనికి ముందు, ఆయన మిలిటరీ ఇంటెలిజెన్స్, ఆ తరువాత ISI అధిపతిగా పనిచేశాడు . 2019లో ఆయన అకస్మాత్తుగా ISI చీఫ్ పదవి నుంచి తొలగించబడ్డాడు.
దేశంలో ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ తొలగింపు తర్వాత మునీర్ అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. కొత్త ప్రభుత్వం ఆయనను సైన్యాధ్యక్షుడిగా నియమించింది. భారతదేశంతో నాలుగు రోజుల ప్రతిష్టంభన తర్వాత ఈ సంవత్సరం ఆయనకు ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందాడు. రక్షణ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) నయీమ్ ఖలీద్ లోధి ప్రకారం.. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇప్పుడు పాకిస్థాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి. రాజకీయ నాయకులు తమ చిన్న చిన్న లాభాల కోసం దేశ భవిష్యత్తును పణంగా పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని రాజకీయ నాయకులు తమను తాము రక్షించుకోవడానికి, భవిష్యత్తులో మునీర్ తమకు మద్దతు ఇస్తూనే ఉండేలా చూసుకోవడానికి ఈ సవరణ చేశారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. షుజా నవాజ్ మాట్లాడుతూ.. 1999లో ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు ఎంత అధికారం చెలాయించారో, ఇప్పుడు మునీర్ కూడా అంతే అధికారం చెలాయిస్తున్నారని అన్నారు. ” మునీర్ ఇప్పుడు సైన్యాన్ని పునర్నిర్మించవచ్చు, అలాగే బలగాలను ఆధునీకరించవచ్చు. ఆయనకు ఫీల్డ్ మార్షల్ హోదా జీవితాంతం ఉంటుంది ” అని అన్నారు.
READ ALSO: Drishyam 3 Rights: కళ్లు చెదిరే ఆఫర్.. పనోరమా స్టూడియోస్‌కు ‘దృశ్యం3’ థియేట్రికల్ రైట్స్