Site icon NTV Telugu

Babar Azam: స్టాండ్లో అభిమానులు చాలా సపోర్ట్ చేశారు.. కృతజ్ఞతలు

Babr Ajam

Babr Ajam

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగా మిగిలి ఉన్నాయి. అటు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్.. 5వ స్థానానికి ఎగబాకింది. పాక్ 7 మ్యాచ్‌ల్లో 3 గెలువగా.. నాలుగింటిలో ఓడిపోయింది. అయితే.. ఈ విక్టరీ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తన స్పందనను తెలిపాడు. ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లలో తమ జట్టు వ్యూహం గురించి చెప్పాడు.

Read Also: Atchannaidu: ఆరోగ్య పరీక్షల కోసం చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్తున్నారు..

బంగ్లాదేశ్తో మ్యాచ్లో తమ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శన చూపించారని బాబర్ ఆజం తెలిపాడు. ఈ విజయం ఘనత తమ ఆటగాళ్లకే దక్కుతుందని అన్నాడు. ఈ మ్యాచ్లో ఫఖర్ జమాన్ అద్భుత ప్రదర్శన చూపించాడని.. అతను 20-30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే ఏం జరుగుతుందో తమకు తెలుసన్నాడు. ఇప్పుడు తమ దృష్టి రాబోయే రెండు మ్యాచ్‌లపైనే ఉందని.. ఆ మ్యాచ్‌లు ఆడిన తర్వాత పాయింట్ల పట్టికలో తమ జట్టు ఎక్కడ ఉంటుందో చూద్దాం అని అన్నాడు.

Read Also: Leo: లియో అన్ కట్ వెర్షన్.. కేవలం వారికి మాత్రమే

మరోవైపు ఈ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉందన్నాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ 15-20 ఓవర్ల తర్వాత మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్న సమయంలో.. తమ బౌలర్లు వికెట్లు తీశారని అన్నాడు. అంతేకాకుండా.. ముఖ్యంగా తమ టీమ్‌కి స్టాండ్ లో ఉన్న అభిమానుల నుంచి చాలా సపోర్ట్‌ వచ్చిందని చెప్పాడు. ఇందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు.

Exit mobile version