Site icon NTV Telugu

Pakistan – Afghanistan: పాక్ పార్లమెంట్‌లో ఆఫ్ఘన్ ప్రకంపనలు.. నంబర్ వన్ శత్రువుగా పోల్చిన రక్షణ మంత్రి

Khawaja Asif

Khawaja Asif

Pakistan – Afghanistan: పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఆఫ్ఘన్ ప్రకంపనలు భీభత్సం సృష్టించాయి. తాజాగా అక్టోబర్ 9 రాత్రి సమయంలో ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ పెద్ద పేలుళ్లతో అతలాకుతలం అయ్యింది. దీంతో పాక్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు మరోసారి విషమంగా మారాయి. పలు నివేదిక ప్రకారం.. పాక్ వైమానిక దళం (PAF) జరిపిన దాడి కారణంగా కాబుల్‌లో పేలుళ్లు సంభవించాయని తెలుస్తోంది.

READ ALSO: Taliban: భారత పర్యటనలో మహిళల్ని దూరం పెడుతున్న తాలిబాన్ ప్రతినిధులు..

పాక్ రక్షణ మంత్రి కీలక ప్రకటన..
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ఆ దేశ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆఫ్ఘన్‌ను పాక్ “నంబర్ వన్ శత్రువు”గా పేర్కొన్నారు. పాక్ దశాబ్దాలుగా ఆఫ్ఘన్ శత్రుత్వాలకు మద్దతు ఇచ్చిందని, కానీ దానికి బదులుగా వాళ్లు “ద్రోహం” చేశారని అన్నారు. “మేము ఆఫ్ఘన్లకు మా ఇళ్లలో ఆశ్రయం కల్పించాము, వారికి దేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చాము, కానీ నేడు వాళ్లు మాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. చాలా మంది ఆఫ్ఘన్ తాలిబన్ల కుటుంబాలు పాక్‌లో స్థిరపడ్డాయి. అక్కడి నుంచి వారు పాక్ వ్యతిరేక సంస్థలకు, ముఖ్యంగా తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)కి మద్దతు ఇస్తున్నారు” అని ఖవాజా ఆసిఫ్ పార్లమెంటులో భావోద్వేగంతో ప్రకటించారు.

పాకిస్థాన్ ఆతిథ్యం వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన వారు ఇప్పుడు తమ విశ్వాసాలను మార్చుకున్నారని ఆయన అన్నారు. “వారు పాక్‌లో వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడ విలాసవంతమైన ఇళ్లు కలిగి ఉన్నారు. కానీ వారు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అనకుండా, ‘ఆఫ్ఘనిస్థాన్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. “మా నగరాల్లో రక్తం ప్రవహిస్తోంది, ఇది మా దేశంలో మేము ఏళ్లుగా ఆశ్రయం కల్పించిన ప్రజలకు నేరుగా సంబంధించినది” అని ఆయన చెప్పరు.

తాజా పాక్ ప్రకటన దాయది- ఆఫ్ఘన్ సరిహద్దు ఉద్రిక్తతలు, వైమానిక దాడులను ప్రతిధ్వనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబూల్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా భారతదేశంతో స్నేహం పెంచుకోవడం ద్వారా దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడానికి కూడా ప్రయత్నిస్తోందని పాక్ అభిప్రాయపడుతుంది. ముఖ్యంగా ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి న్యూఢిల్లీ పర్యటనను పాక్ “వ్యూహాత్మక ఓటమి”గా చూస్తుందని పేర్కొన్నారు. ఇది ఇస్లామాబాద్‌లో ఆఫ్ఘన్ పట్ల కోపం, కఠినమైన వైఖరి కలయికకు దారితీసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పాక్ ‘బహిష్కరణ డ్రైవ్’ వెనుక ఉన్న రాజకీయాలు..
పాకిస్థాన్‌లో 2023 అక్టోబర్‌లో ప్రారంభమైన ఆఫ్ఘన్‌లను బహిష్కరించాలనే ప్రచారం ఇప్పుడు తీవ్రమైంది. ఇది కేవలం “చట్టపరమైన పత్రాలను ధృవీకరించడం” మాత్రమే కాదు, “జాతీయ భద్రత” అని పాక్ ప్రభుత్వం పేర్కొంది. లక్షలాది మంది పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో అస్థిరతను వ్యాపింపజేస్తున్నారని, ఉగ్రవాద దాడుల్లో ఎక్కువగా పాల్గొంటున్నారని పాక్ చెబుతోంది. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి చేసిన ప్రకటన ఇప్పుడు ఈ మొత్తం ప్రచారానికి కొత్త రాజకీయ, భావోద్వేగ ఊపును ఇచ్చిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితులు రెండు దేశాల మధ్య ద్వేషం, అనుమానాల గోడను సృష్టించిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Anger Management: కోపాన్ని జయించడం ఎలాగో తెలుసా?

Exit mobile version