పాకిస్థాన్ బౌలింగ్ లో మెరుపు వేగంతో బౌలింగ్ వేసే బౌలర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది షహీన్ షా ఆఫ్రిది. అంతేకాదు పాకిస్తాన్ బౌలర్లలో అఫ్రిది తర్వాత నసీమ్, హరీస్ సోహైల్ మంచి ప్రదర్శన చూపిస్తారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ బౌలర్లలో మరో ఆటగాడు తన పేరును నమోదు చేసుకున్నాడు. 21 ఏళ్ల ఉన్న జమాన్ ఖాన్.. అతను బౌలింగ్ చేసే విధానం చూస్తే.. రాబోయే రోజుల్లో ప్రత్యర్థులకు షాహీన్ కంటే బలంగా మారే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 లీగ్ వియాట్‌లిటీ బ్లాస్ట్‌లో జమాన్ ఖాన్ అద్భుత ప్రదర్శన చూపించాడు. డెర్బీషైర్ తరపున ఆడుతున్న జమాన్.. 8.28 ఎకానమీ మరియు 16.6 సగటుతో 25 వికెట్లు తీశాడు. అందులో 14 మంది బ్యాట్స్‌మెన్లను క్లీన్ బౌల్డ్ చేశాడు.
NCP Crisis: కొందరు ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు: అజిత్ పవార్ వర్గం
జమాన్ ఖాన్ మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తూ వికెట్లను పడగొడుతున్నాడు. అతని బౌలింగ్ చూసి బ్యాట్స్ మెన్లే హడలెత్తిపోతున్నారు. అతని మొట్టమొదట వియాట్‌లిటీ టీ20లో బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడా చూసినా అతని గురించే చర్చించుకుంటున్నారు. ఈ టోర్నమెంట్ లో అతను వేసిన యార్కర్ బాల్ అందరిని ఆకట్టుకుంది. జర్మనీకి చెందిన బ్యాట్స్‌మన్ ను ఔట్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంది.
Sai Chand Son: కంటతడి పెట్టిస్తున్న సాయిచంద్ కుమారుడి ఫోటో!
ఇంగ్లండ్‌లో తనదైన ముద్ర వేసిన జమాన్ ఖాన్.. ఇప్పుడు అవకాశం దొరికితే భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జమాన్ ఖాన్.. లసిత్ మలింగ యాక్షన్ బౌలింగ్ లో వేస్తున్నాడు. అయితే భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఇలాంటి బౌలర్లు ఆడితే.. క్రికెట్ అభిమానులకు పండగే. మరోవైపు మలింగ లాంటి యాక్షన్ బౌలర్లు భారత మైదానంలో చాలా రాణిస్తున్నారు. లసిత్ మలింగ నుండి పతిరానా వరకు భారత మైదానంలో చాలా వికెట్లు పడగొట్టారు. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌లో తదుపరి పేరు జమాన్ ఖాన్ కావచ్చు.
