Pakistan Balochistan Operation: బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్ ఆపరేషన్.. ఎంత మంది చనిపోయారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Balochistan Operation: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గత రెండు రోజుల్లో పాకిస్థాన్ భద్రతా దళాలు కనీసం 47 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నాయి. పాకిస్థాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ (ISPR) శనివారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఆగస్టు 7 – 8 మధ్య రాత్రి జోబ్ జిల్లాలోని సంబాజా ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 33 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నాయి. ఆగస్టు 8 – 9 రాత్రి ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని సంబాజా చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగిన మరో ఆపరేషన్‌లో 14 మంది ఉగ్రవాదులు మరణించారని ISPR ఒక ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్‌లో ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
READ MORE: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
31 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్..
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆగస్టు 31 వరకు మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు ISPR అధికారులు తెలిపారు. బలూచిస్తాన్ హోం శాఖ ఈనెల 6న జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రావిన్స్‌లో శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ సేవలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ ధ్రువీకరించారు. పాకిస్థాన్‌లో ఈనెల 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు వేడుకల్లో ఆందోళనలు సృష్టించే అవకాశం ఉందని పాక్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత గురువారం, వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన బాంబు పేలుడులో సుమారు ముగ్గురు మరణించగా.. అదే సమయంలో, ముగ్గురు పోలీసులతో సహా 13 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌లో, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) నవంబర్ 2022లో ప్రభుత్వంతో కాల్పుల విరమణను ముగించినప్పటి నుంచి, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులలో తీవ్రవాద దాడులు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలిపారు.
బలూచిస్థాన్ వేర్పాటువాద ఉద్యమానికి నాంది..
బలూచిస్థాన్ ప్రాంతం నైరుతి పాకిస్థాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్గానిస్థాన్లలో వ్యాపించి ఉంది. ఈ ప్రాంతానికి చెందిన స్థానిక తెగే బలూచీ ప్రజలు. పాక్ మొత్తం జనాభాలో వీరి వాటా 3.6శాతం. ఇరాన్, అఫ్గానిస్థాన్ జనాభాలో రెండు శాతం బలూచ్ ప్రజలు ఉంటారు. మొత్తం పాకిస్థాన్ భూభాగంలో ఇది 44శాతం దాకా ఉంటుంది. బలూచిస్థాన్ వేర్పాటువాద ఉద్యమానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు బలూచిస్థాన్‌ను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయక ముందు వరకూ ఆ ప్రాంతం స్వతంత్రంగా సొంత గిరిజన పాలనలో ఉండేది. ఇండియా విభజన తరవాత ఈ ప్రాంతం పాకిస్థాన్‌లో భాగం అయ్యింది. అప్పటికి అత్యధిక బలూచిస్థాన్ ప్రాంతాన్ని కలాట్ కేంద్రంగా పాలిస్తున్న రాజు తొలుతా స్వతంత్ర దేశం కోసం డిమాండ్ చేసినా ఆయనపై.. పాకిస్థాన్‌లో విలీనానికి తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీన్ని చాలామంది బలూచిస్థాన్ వాసులు వ్యతిరేకించారు. ఇదే వేర్పాటువాదానికి పునాదిగా నిలిచింది.
READ MORE: Raksha Bandhan: అడవి వీడి అన్న చెంతకు.. 40 ఏళ్ల తర్వాత రాఖీ కట్టిన చెల్లి..
తాజావార్తలు
-
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్‌దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
-
Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
-
IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ వార్నింగ్..
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..