Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- ఎర్ర సముద్రంలో సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీ దాడులు.
- సౌదీకి అండగా నిలుస్తామన్న పాక్ ప్రధాని షరీఫ్..
- దాడులు అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన అని పాకిస్తాన్ వ్యాఖ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా-ఇరాన్ యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా చమురు ట్యాంకర్లపై ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఈ ఘటనను పాకిస్తాన్ ప్రధాని షహబాఝ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌తో ఫోన్లో మాట్లాడారు.
ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతోంది. ఇప్పుడు మరో బాబ్ అల్ మాండెప్ జలసంధిలో హౌతీలు దాడులు చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోని ఓడరేవులు, ఎయిర్ పోర్టుల్ని సౌదీ అరేబియా దిగ్బంధించడం వల్లే దాడులకు పాల్పడినట్లు హౌతీలు చెబుతున్నారు.
Also Read
- Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
- Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
- UK: లండన్‌లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
దీనిపై పాక్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని, అంతర్జాతీయ చట్టాన్ని నేరుగా ఉల్లంఘించడమే అని అన్నారు. ఇది ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. పాకిస్తాన్ సౌదీ అరేబియాకు అండగా నిలుస్తుందని ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో తాను, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, పాకిస్తాన్ సౌదీ అరేబియాకు అండగా నిలుస్తుందని అన్నారు. ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి, మొత్తం ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం సౌదీ అరేబియాతో, అంతర్జాతీయ సమాజంతో పాకిస్తాన్ కలిసి పనిచేస్తుందని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!