Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పాకిస్థాన్ సైనిక దళాలకు సోషల్ మీడియాలో కలరింగ్ ఇవ్వడం, లేని విజయాన్ని ఉన్నట్లు చూపించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి వారు ఏకంగా ఊహాశక్తికి పదును పెట్టి, కృత్రిమ మేధ (AI) సాయంతో ఓ బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను మించిన గ్రాఫిక్స్ వీడియోను వదిలారు. 2025 మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో తాము భారతదేశంపై ఏ రేంజ్లో విరుచుకుపడ్డామో చూపిస్తూ పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ‘ఫిజాఓన్ కే పాస్బాన్’ పేరిట ఈ యానిమేషన్ వీడియోను విడుదల చేసింది. అయితే ఇందులో చిన్న లోపం ఏంటంటే.. అసలు నిజమైన సాక్ష్యాలు గానీ, ఒక్క ఫోటో గానీ అందులో లేవు.
ఈ వీడియోలో పాకిస్థాన్ వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలు చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కానంత విచిత్రంగా ఉన్నాయి. భారతదేశపు అధునాతన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను రెంటింటిని ధ్వంసం చేశామని, భారత్‌కు చెందిన 32 ఎయిర్ బేస్‌లను తునకలు చేశామని, చివరికి భారత పార్లమెంట్, గుజరాత్‌లోని కాండ్లా పోర్ట్, ఐఎన్ఎస్ విక్రాంత్‌లపై కూడా దాడులు చేశామని ఆ వీడియోలో చూపించారు. అంతేకాకుండా ఉపగ్రహాలను జామ్ చేయడం, గ్రిడ్లను నిలిపివేసి విద్యుత్‌ను నిలిపేయడం, ఇంధన సరఫరాలను అడ్డుకోవడం వంటి మాయాజాలాలను తాము చేసేశామని భ్రమపడ్డారు. నాలుగు రఫేల్, ఒక సుఖోయ్, మిగ్-29, మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో పాటు ఒక హెరాన్ డ్రోన్‌ను కూల్చేశామని గ్రాఫిక్స్ వీడియోలో చూపించారు. అయితే 32 ఎయిర్ బేస్‌లపై జరిగిన దాడులకు సంబంధించిన రన్వేలు, హ్యాంగర్లు ధ్వంసమైనట్లు ఒక్కటంటే ఒక్క ఉపగ్రహ చిత్రాన్ని లేదా వీడియో ఆధారాన్ని పాకిస్థాన్ ప్రదర్శించలేకపోయింది. అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాక్ సైన్యం చేతిలో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టే, ఇలా ఏఐ గ్రాఫిక్స్‌తో కాలం వెళ్లదీస్తోందని స్పష్టమవుతోంది. ఇది పాకిస్థాన్ సిగ్గుమాలిన చర్యగా సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Elon Musk: ఇక 5 - 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
- Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
- 9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
మరోవైపు భారతదేశం విడుదల చేసిన ఆధారాలను చూస్తే అసలు వాస్తవం ఏంటో ప్రపంచానికి తేటతెల్లమవుతుంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన వెంటనే భారత్ పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడులు, 11 పాకిస్థాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ప్రత్యక్ష దృశ్యాలను ఆధారాలతో సహా ప్రపంచం ముందు ఉంచింది. అంతర్జాతీయ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT), శాటిలైట్ ఆధారాలు కూడా భోలారీ, సర్గోధా, నూర్ ఖాన్ వంటి పాక్ ఎయిర్ బేస్‌లు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో ప్రపంచానికి చూపించాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలపై భారత్ జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని అమెరికాకు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రచురించింది. భారత్ రియల్ దాడి ఆధారాలను చూపిస్తే, పాకిస్థాన్ రియల్ ఎఫెక్ట్స్ (AI) చూపిస్తుండడం ఇక్కడ గమనార్హం.
ఇక పాకిస్థాన్ పేల్చిన పెద్ద తుపాకీ డాంబికం.. S-400 వ్యవస్థలను నాశనం చేశామని చెప్పడం. ఈ క్లెయిమ్‌ను భారత్ ఎప్పుడో తిప్పికొట్టింది. ఆపరేషన్ ముగిసిన కొద్ది రోజులకే ప్రధాని నరేంద్ర మోడీ ఆడంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడ చెక్కుచెదరకుండా ఉన్న S-400 సిస్టమ్ ముందు నిలబడి ప్రసంగించడమే పాకిస్థాన్‌కు పడిన అతిపెద్ద చెంపపెట్టు. ఇటీవలే డిస్కవరీ ఛానెల్ ‘డిక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ పేరిట విడుదల చేసిన రెండు భాగాల డాక్యుమెంటరీలో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అసలైన దృశ్యాలను, పాక్ ఎంతగా దెబ్బతిన్నదో వివరంగా చూపించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే పాకిస్థాన్ ఈ ఏఐ వీడియోను తీసుకురావడం వారికే ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ విడుదల చేసిన ఈ ‘కల్పిత’ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అవుతోంది. “వీడియో ఎడిటింగ్ కాంటెస్ట్ ఉంటే పాకిస్థాన్‌కే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది” అని కొందరు ఎద్దేవా చేస్తుంటే, “పాకిస్థాన్‌కు డిఫెన్స్ బడ్జెట్ అక్కర్లేదు, ఒక ఏఐ వీడియో జనరేటర్ ఉంటే చాలు, యూట్యూబ్‌లోనే యుద్ధాలు గెలిచేస్తారు” అని నెటిజన్లు ఆడుకుంటున్నారు.
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!