Pakistan – Afghanistan: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. శుక్రవారం రాత్రి ఇరు దేశాల సైన్యాలు సరిహద్దు వెంబడి ఒకరి సైన్యంపై మరొకరు కాల్పులు జరిపారు. పలు నివేదికల ప్రకారం.. ఈ కాల్పులలో ఇరువైపుల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ సంఘటన తర్వాత రెండు నెలలుగా అమలులో ఉన్న కాల్పుల విరమణపై అనేక ప్రశ్నలు లేవనెత్తినట్లు అయ్యాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఇరు వర్గాలు ఒకరినొకరు నిందించుకున్నాయి.
READ ALSO: Sonia Gandhi: నెహ్రూను కించపరచడమే బీజేపీ లక్ష్యం..
పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని చమన్, స్పిన్ బోల్డాక్ ప్రాంతాలలో కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ పోలీసు అధికారి మొహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ.. ముందుగా కాల్పులు ఆఫ్ఘన్ వైపు నుంచి ప్రారంభమయ్యాయని, దీంతో పాకిస్థాన్ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో కాబూల్‌లోని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ మొదటి దాడిని ప్రారంభించిందని, అలాగే ఆఫ్ఘన్ దళాలు కాల్పులకు ప్రతీకారం తీర్చుకోవాలని బలవంతం చేసిందని ఆరోపించారు. ఆఫ్ఘన్ సరిహద్దు పోలీసు ప్రతినిధి అబ్దుల్లా ఫరూఖీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ దళాలు మొదట హ్యాండ్ గ్రెనేడ్ విసిరాయని, దీనితో ఆఫ్ఘన్ దళాలు ప్రతి చర్య తీసుకోవలసి వచ్చిందని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
వాస్తవానికి అక్టోబర్‌లో రెండు దేశాల మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు మరణించారు. అదే సమయంలో వందలాది మంది గాయపడ్డారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల మధ్య అక్టోబర్‌లో కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. ఇది ఇరు దేశాల మధ్య పరిస్థితిని కొంతవరకు శాంతపరిచింది. అయితే ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు ఒక నిర్దిష్ట ఒప్పందానికి రాలేకపోయాయి, ఇది నిరంతర సరిహద్దు ఉద్రిక్తతలకు దారి తీస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Team India: వరుసగా 20 ఓటముల తర్వాత టీమిండియాకు విజయం.. ఎందులోనే తెలుసా!
