NTV Telugu Site icon

CWC 2023 India Final: భారత్‌ ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా!

Sehar Shinwari

Sehar Shinwari

Pakistan Actress Sehar Shinwari expresses her frustration on India after Reach ODI World Cup 2023 Final: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో వరుస విజయాలు సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా.. అదే ఊపులో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. 2011లో విశ్వవిజేతగా నిలిచిన భారత్.. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు వెళ్లింది. ఫైనల్‌కు వెళ్లిన టీమిండియాపై ప్రస్తుతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే టీమిండియాపై ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే పాకిస్తాన్‌ నటి సెహర్‌ షిన్వారీ.. మరోసారి తన కుళ్లు బుద్ధిని బయటపెట్టింది.

వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్‌ ఫైనల్‌కు వెళ్లడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నా అని సెహర్‌ షిన్వారీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ‘భారత జట్టు మళ్లీ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరడాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. భారత్ అన్నింటిలో పాకిస్తాన్ కంటే ఎందుకు ముందు ఉందో అర్థం కావడం లేదు’ అని షిన్వారీ తన కుళ్లు బుద్ధిని చూపించింది. ‘త్వరలోనే బీసీసీఐ, బీజేపీలు సర్వనాశనం కానున్నాయి’ అని మరో ట్వీట్‌లో పేర్కొంది.

Also Read: Mohammed Shami Records: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఎవరికీ సాధ్యం కాలే!

భారత్‌తో పాటు బీజేపీ పార్టీపై పాక్ నటి సెహర్‌ షిన్వారీ సంచలన కామెంట్స్‌ చేసింది. ‘భారత్ ప్లేయర్స్ మంచి నటులు. ఈ మ్యాచ్‌ ముందుగానే ఫిక్స్‌ అయ్యిందని వారికి తెలుసు. నిజంగానే మ్యాచ్‌ ఆడుతున్నట్లు భలే నటించారు’ అని సెహర్‌ షిన్వారీ ఇంకో ట్వీట్‌ చేసింది. పాక్ నటి వరుస ట్వీట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై భారత్ ఫాన్స్ మండిపడుతున్నారు. భారత జట్టుపై ఇలా అక్కసు వెళ్లగక్కడం ఇదేమీ మొదటిసారి కాదు. ప్రపంచకప్‌ 2023 ప్రారంభం నుంచే పలు సందర్భాల్లో టీమిండియాపై షిన్వారీ తన కుళ్లు బుద్ధి చూపిస్తోంది. భారత్‌పై విజయం సాధిస్తే.. బంగ్లాదేశ్ ఆటగాళ్లుతో డేటింగ్‌కు వెళతానని ప్రకటించిన విషయం తెలిసిందే.

Show comments