Mohammed Shami Records in ODI World Cups: బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 7 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్‌లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో భారత్‌కు షమీ ఆపద్భాందవుడయ్యాడు. క్రీజులో నిలదొక్కుకున్న కేన్ విలియమ్సన్‌తో పాటు టామ్ లేథమ్‌ను ఒకే ఓవర్లో ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆపై ప్రమాదకర మిచెల్‌ను పెవిలియన్ పంపి.. టీమిండియా హీరో అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. సెమీ ఫైనల్‌లో దుమ్ములేపిన షమీ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
# వరల్డ్‌కప్ 2023లో మహ్మద్ షమీ ఐదుకు పైగా వికెట్లు సాధించడం ఇది మూడో సారి. అంతకుముందు న్యూజిలాండ్, శ్రీలంకపై ఐదు వికెట్స్ పడగొట్టాడు. వన్డే వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్‌గా షమీ రికార్డుల్లో నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు మరే బౌలర్‌కు సాధ్యం కాలేదు.
# వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధికసార్లు ఐదు వికెట్స్ పడగొట్టిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 4 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2019 వరల్డ్‌కప్‌లో కూడా షమీ ఒక ఫైవ్ వికెట్ల హాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది.
# అంతర్జాతీయ వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా మహ్మద్ షమీ నిలిచాడు. న్యూజిలాండ్‌పై 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీసిన షమీ.. ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. 2014లో బంగ్లాదేశ్‌పై 4 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Rohit Sharma: బాప్రే.. ఆ ఇద్దరు భయపెట్టారు: రోహిత్
# వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా మహ్మద్ షమీ నిలిచాడు. షమీ 17వ ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. మిచెల్ స్టార్క్ 19 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్స్ పడగొట్టాడు.
# వన్డే ప్రపంచకప్‌లలో భారతదేశం తరపున టాప్ వికెట్ టేకర్‌గా (54) మహ్మద్ షమీ నిలిచాడు. మొత్తంగా గ్లెన్ మెక్‌గ్రాత్ 39 మ్యాచ్‌లలో 71 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.