NTV Telugu Site icon

Seema Haider: సీఏఏ అమలుపై సీమా హైదర్ రియాక్షన్.. ప్రధానిపై ప్రశంసలు

Seema Haider

Seema Haider

Pak Woman: భారత్ లో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సోమవారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై భారత్‌లోకి అక్రమంగా చొరబడిన పాకిస్థాన్ మహిళ ( Pak Woman) సీమా హైదర్ స్పందించారు. సీఏఏ అమలును స్వాగతిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) పై ప్రశంసలు కురిపించింది. ప్రధాని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సీమా హైదర్ చెప్పుకొచ్చింది.

Read Also: Gunfire : ప్రియురాలితో, గన్‎తో జోక్స్ వద్దు.. పేలితే ఇలా ప్రాణం పోద్ది

ఇక, భారత ప్రభుత్వం ఈ రోజు నుంచి దేశంలో పౌరసత్వ (CAA) చట్టాన్ని అమలు చేసింది. సీఏఏ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన చూశాక చాలా సంతోషం అనిపించింది అని సీమా హైదర్ (Seema Haider) తెలిపింది. మోడీ సర్కార్ ను అభినందిస్తున్నాం.. నిజంగా మోడీ జీ చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నారు అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను.. ఈ చట్టంతో మేం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. నాకు భారత పౌరసత్వం వచ్చేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని నమ్ముతున్నట్లు సీమా హైదర్‌ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Read Also: KTR: కరీంనగర్ సభకు నేను రాలేను.. కారణం చెప్పిన కేటీఆర్

అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేండ్ల కిందట ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)ను తాజాగా అమలు చేస్తుంది. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దీని కోసం వెబ్‌ పోర్టల్‌ను కూడా సిద్ధం చేసినట్టు హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే, మరోవైపు విపక్షాలు మాత్రం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.