Site icon NTV Telugu

PAK vs IND: పాకిస్థాన్‌కి కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్స్.. టీమిండియాకు భారీ టార్గెట్!

Pak Vs Ind

Pak Vs Ind

PAK vs IND: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్, భారత్‌ తలపడ్డాయి. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక పాకిస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్ 45 బంతులలో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఫఖర్ జమాన్ వేగంగా పరుగులు చేసినా హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

Alcohol and Weight Gain: అధిక బరువు ఉన్న వాళ్లు మద్యం తాగితే ఏం జరుగుతుంది..? షాకింగ్ నిజాలు..

ఆ తర్వాత సాయిమ్ ఆయుబ్ (21), హుస్సేన్ తలత్ (10) లు ఆచితూచి ఆడారు. కానీ శివం దూబే, కులదీప్ యాదవ్ వరుస వికెట్లతో పాకిస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. కానీచివరి ఓవర్లలో సల్మాన్ ఆఘా (17*) ఫహీమ్ అష్రఫ్ (20*) ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోరును 171/5కు చేర్చారు. వీరికి తోడుగా మొహమ్మద్ నవాజ్ (21) కూడా మంచి సహకారం అందించాడు. ఇక భారత బౌలర్లలో శివం దూబే అద్భుతంగా రాణించాడు. అతను 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసుకున్నాడు. కులదీప్ యాదవ్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. అయితే జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో ఏకంగా 45 పరుగులు ఇచ్చినా వికెట్ తీసుకోలేకపోయారు. మరోవైపు భారత ఫీల్డర్లు అనేక క్యాచ్ లు వదిలేయడంతో పాకిస్థాన్ భారీ స్కోర్ అందుకుంది.

OG : ఆ హీరోయిన్ ను నెత్తిన పెట్టుకుంటున్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?

Exit mobile version