Pahalgam Attack: కశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి వెనుక కుట్ర నెమ్మదిగా బయటపడుతోంది. ఉగ్రవాదులతో నాలుగుసార్లు సమావేశమై, వారికి లాజిస్టికల్ మద్దతును అందించి, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లను సరఫరా చేసిన ఓ వ్యక్తిని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నిందితుడి పేరు 26 ఏళ్ల మొహమ్మద్ యూసుఫ్ కటారి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రకారం.. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్ అలియాస్ ఆసిఫ్, జిబ్రాన్, హంజా ఆఫ్ఘనిలను నాలుగుసార్లు కలిసినట్లు మహ్మద్ యూసుఫ్ కటారి విచారణలో అంగీకరించాడు. అంతేకాకుండా.. వారికి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఛార్జర్‌ను అందించాడు. దీని ద్వారానే పోలీసులు అతన్ని ట్రాక్ చేయగలిగారు. నిందితుడు మొబైల్ ఫోన్ ఛార్జర్‌లను అందించడమే కాకుండా పహల్గామ్ దాడి చేసిన వారికి పర్వత ప్రాంతాలలో నావిగేట్ చేయడానికి కూడా సహాయం చేసినట్లు తేలింది.
READ MORE: Ari Trailer : ఇంకా కావాలనిపిస్తుంది.. అనసూయ కొత్త సినిమా ట్రైలర్ చూశారా
వాస్తవానికి.. జూలైలో ప్రారంభించిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ (ఆపరేషన్ మహాదేవ్) సందర్భంగా శ్రీనగర్ శివార్లలోని జబర్వాన్ కొండల దిగువ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమార్చారు. సంఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులలో పాక్షికంగా కాలిపోయిన మొబైల్ ఛార్జర్ కూడా ఉంది. ఈ మొబైల్ ఛార్జర్ సీరియల్ నంబర్, కనెక్టివిటీ డేటాను ఫోరెన్సిక్ పరీక్ష గుర్తించారు. దీంతో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. శ్రీనగర్ పోలీసులు ఛార్జర్ అసలు యజమానిని కనుగొన్నారు. అతను దానిని ఒక డీలర్‌కు విక్రయించినట్లు తేలింది. డీలర్ నుంచి కొనుగోలు చేసిన మొహమ్మద్ యూసుఫ్ కటారి పోలీసులు పట్టుకున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో అరెస్టు చేశారు. ఇలా ఒక ఛార్జర్ దేశ ద్రోహిని పట్టించింది.
