Site icon NTV Telugu

Pahalgam Terror Attack: ఈ ఉగ్రదాడిపై పాకిస్థాన్‌లో ఏమనుకుంటున్నారో తెలుసా?

Pakisthan

Pakisthan

పహల్గాంలో జరిగిన దాడికి గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. ఈ దాడిలో 26 మంది అమాక టూరిస్టులు మృతి చెందడంతో అందరూ భారత్‌కు సపోర్టుగా నిలిచారు. మన దేశంలోని పౌరులు ఈ దాడిపై రగిలి పోతున్నారు. పాక్‌పై కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటికైనా శాంతి మంత్రాన్ని పక్కన పెట్టి యుద్ధం ప్రకటించాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం “WewantRevenge” ట్యాగ్ వైరల్ అయ్యింది. అయితే.. పాకిస్థాన్‌లో సాధారణ జనాలు మాత్రం భారత్‌పై విరుచుకుపడుతున్నారు. పలు ప్రాంతాల్లో సంబరాలు సైతం జరుపుకుంటున్నారట. ఈ దాడిపై శత్రుదేశం పాకిస్థాన్‌లో కీలక వ్యక్తులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..

READ MORE: Pahalgam Terror Attack: స్టూడెంట్‌గా వెళ్లి టెర్రరిస్ట్‌గా తిరిగొచ్చాడు.. ఉగ్రవాది ఆదిల్ బ్యాగ్రౌండ్ ఇదే!

వాస్తవానికి పహల్గాం దాడికి సంబంధించి పాకిస్థాన్ నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు ఎంపీ షెర్రీ రెహ్మాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఇలా రాశారు.. “పహల్గాంలో జరిగిన విషాదకరమైన దాడిని నేను ఖండిస్తున్నాను. దురదృష్టవశాత్తు జరిగిన ఈ దాడికి కూడా పాకిస్థాన్ కారణం అనడం భారత్‌కు సాధారణమై పోయింది” అన్నారు. భారత్ తన వైఫల్యాలను ఆపడంలో విఫలమైందని.. నియంత్రణ రేఖ (LOC) వెంబడి వ్యూహాత్మక స్థిరత్వం, బాధ్యతాయుతమైన ఒప్పందం కోసం పిలుపునిచ్చే సహేతుకమైన స్వరాలను విస్మరిస్తున్నారన్నారు. ఊహించినట్లుగానే, ఎటువంటి దర్యాప్తు లేకుండా, భారతదేశ రైట్ వింగ్ ఇప్పుడు పాకిస్థాన్‌ను నాశనం చేయాలని పిలుపునిస్తుందని షెర్రీ అన్నారు.

READ MORE: Vijayawada: కుదేలవుతున్న కశ్మీర్ ట్రావెల్స్.. అమర్‌నాథ్ యాత్రికులు సైతం వెనకడుగు..

భారతదేశంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్‌గా పని చేసిన ఓ అధికారి తన స్పందించారు. భారత్ దుస్సాహసాన్ని అడ్డుకోవడానికి పాకిస్థాన్ పూర్తిగా సిద్ధంగా ఉందని నాకు నమ్మకం ఉంది. ఈసారి పాకిస్థాన్ సమాధానం తగిన విధంగా ఉంటుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

READ MORE: Pahalgam Terror Attack: స్టూడెంట్‌గా వెళ్లి టెర్రరిస్ట్‌గా తిరిగొచ్చాడు.. ఉగ్రవాది ఆదిల్ బ్యాగ్రౌండ్ ఇదే!

అమెరికాలో పాకిస్థాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత గాజా విషాదంలో మునిగిపోయింది. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కశ్మీర్‌లో జరిగిన దాడి కూడా పరిణామాల పరంగా అంతే భయంకరమైనది. ఈ ఉగ్రవాద దాడిని అన్ని నాగరిక దేశాలు, ప్రజలు ఖండించాలి” అని ఎక్స్‌ పోస్టు ద్వారా సానుకూలంగా స్పందించారు.

READ MORE: Arjun Reddy : ఓర్నీ.. నువ్వు కూడా కాపీ కొట్టావా.. సందీప్ రెడ్డి వంగా..

భారతదేశంలో ఏదైనా ఉగ్రవాద దాడి జరిగినప్పుడల్లా, భారత్‌ నేరుగా పాకిస్థాన్‌ను వేలెత్తి చూపుతుందని పాకిస్థాన్‌లోని పలు మీడియా సంస్థలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశం దీన్ని ఎవరు చేశారో గుర్తించి వారిపై ప్రతీకార చర్య తీసుకోవాలనుకుంటే ఎవరైనా దానిని ఆపగలరా? అని పాకిస్థాన్ జర్నలిస్ట్ సిరిల్ అల్మెయిడా ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Exit mobile version