Kerala: కేరళ రాజధాని తిరువనంతపురం తూర్పు కోటలో ఉన్న శ్రీ పద్మనాథ స్వామి ఆలయానికి సంబంధించి కీలక సమాచారం వెలువడింది. ఆలయంలో ఇటీవల బంగారం మాయమైన విషయం తెలిసిందే. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే బంగారం దొరికింది. గోల్డ్ దొరికినప్పటికీ ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారు పూత కోసం గోల్డ్ నాణేలను తీశారు. ఆ సమయంలో స్ట్రాంగ్ రూమ్‌లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని దర్యాప్తులో తేలింది.
READ MORE: AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్పై చర్చ!
కాగా.. దర్యాప్తులో భాగంగా, ఆరుగురు ఆలయ ఉద్యోగులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి కోసం ఫోర్ట్ పోలీసులు తిరువనంతపురం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు పరీక్షకు ఆమోదం తెలిపింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఉద్యోగులు దొంగతనానికి ప్రయత్నించారా లేదా నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. లై-డిటెక్షన్ పరీక్షలు కోర్టులో సాక్ష్యంగా ఆమోదయోగ్యం కాదు.. కానీ.. ఆ ఉద్యోగుల నుంచి అసలు నిజాన్ని బయటపెట్టేందుకు, కేసులో కీలకమైన ఆధారాల కోసం ఈ పరీక్ష సహాయపడుతుందని చెబుతున్నారు.
READ MORE: AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్పై చర్చ!
అసలు ఏం జరిగింది..?
ఈ ఏడాది మే 7-10 మధ్య, గర్భగుడి తలుపుకు బంగారు పూత పూయడానికి స్ట్రాంగ్ రూమ్ నుంచి సుమారు 107 గ్రాముల బరువున్న 13 బంగారు నాణేలు కనిపించకుండా పోయాయి. అనంతరం అదృశ్యమైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలయ స్ట్రాంగ్ రూమ్ నుంచి సుమారు 40 మీటర్ల దూరంలోని ఇసుకతిన్నెల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక నిర్ధరణలో ఇది దొంగతనం కాదని తేల్చారు. ఆలయ గోపురానికి తాపడం కోసం భక్తులు 13 సవర్ల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. మే10న లాకర్ తెరిచినప్పుడు బంగారం అదృశ్యమైందని ఆలయ అధికారులు కనుగొన్నారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
