Site icon NTV Telugu

Padi Kaushik Reddy : ఎన్ని కుట్రలు చేసినా.. రేవంత్ రెడ్డికి తలవంచం నిలదీస్తూనే ఉంటాం

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy : హుజురాబాద్‌MLA పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.. అయితే… కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే సుబేదారి పోలీస్‌ స్టేషన్‌కు బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీం చేరుకుంది. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా… రేవంత్ రెడ్డికి తలవంచం నిలదీస్తూనే ఉంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే తన అరెస్ట్ అని పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి నోటీసు ఇవ్వకుండా ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేయడం అక్రమం అని కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కుట్రలు – అక్రమ కేసులు ఎన్ని పెట్టినా.. నిజాయితీ తలవంచదన్నారు కౌశిక్‌రెడ్డి.

DSP : మళ్లీ ఫాంలోకి వచ్చిన దేవి శ్రీ.. ‘కుబేరా’ తో హ్యాట్రిక్ కొట్టాడుగా

శంషాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానమన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీ కుట్రలు, అక్రమ కేసులతో నన్ను ఆపాలని అనుకోవడం.. మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంన్నీ చాటుతోందని ఆయన విమర్శించారు. ముమ్మాటికి మీరు ప్రస్తావిస్తున్న క్వారీ రేవంత్ రెడ్డి కుటుంబంతోపాటు సీతక్క బినామీయులది…. దానివల్ల ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నదని ఆయన ఆరోపించారు. వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని ఆయన అన్నారు. ఇచ్చిన భూమి పరిధి దాటి అక్రమంగా క్వారీని నడుపుతూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని, ఆ ప్రాంత ప్రజల కోసం ఈ అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని ఆయన అన్నారు.

Cyber Fruad: సైబర్ నేరగాళ్ల వలలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.. రూ. 1.04 కోట్లు స్వాహా

Exit mobile version