NTV Telugu Site icon

Paddy Issue: వర్షాలతో అన్నదాతల అగచాట్లు

Padd1

Padd1

కష్టపడి వరి పండించిన రైతులను వర్షాలు పరేషాన్ చేస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నాడు…కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోగా మరికొన్నిచోట్ల తేమ పేరుతో ఆలస్యం కావడం కర్షకులకు కష్టాలు ఎదురౌతున్నాయి. నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్ల పరిస్థితి రైతులను ఆందోనకు గురిచేస్తోంది.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి..ముఖ్యంగా మంచిర్యాల ,నిర్మల్ జిల్లాల్లో వరి ఎక్కువగా సాగు చేశారు.ఈరెండు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి..అయితే మంచిర్యాల జిల్లాలో చాలా చోట్ల ఇంకా కాంటాలు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ముఖ్యంగా చెన్నూర్ నియోజకవర్గంలో అయితే ఏకంగా రైతులు రోడ్డుపై రాస్తారోకోలకు దిగుతున్నారు…బెల్లంపల్లి తోపాటు పలు మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ఇప్పటికే రెండు దఫాలుగా అకాల వర్షాలు రైతుల ధాన్యం ను నీటి పాలు చేసింది..కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం వరదనీటిలో కొన్నిచోట్ల కొట్టుకు పోయింది. రైతులకు కనీసం టార్ఫాలిన్లు సైతం అందుబాటులో లేకపోవడం కల్లాల్లో ధాన్యం తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో లక్ష 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా మొత్తం 43 రైస్‌ మిల్లులున్నాయి. 185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో కొన్ని చోట్ల ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈసారి యాసంగి మంచిర్యాల జిల్లాలో 72 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 221 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.అయితే ఇందులో సగం కేంద్రాలు సైతం ప్రారంభం కాకపోగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్ లు,మరికొన్ని చోట్ల టార్ఫాలిన్లు లేక అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారు..పొద్దంతా కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు నేర్పుతూ సాయంత్రం అయితే మళ్లీ కుప్పగా పోస్తూ కవర్లు కప్పేస్తూ తిప్పలు పడుతున్నారు..సకాలంలో కొనుగోలు చేయాల్సిన అధికారులు కాలయాసన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల సన్నవరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటున్నారు రైతులు,.

ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటున్నారు రైతులు. తీవ్రమైన గాలులు,ఇంకో వైపు ఎండలతో కేంద్రాల వద్ద యాతన అనుభవిస్తున్నామంటున్నారు రైతులు. అధికారులు ఏం చేస్తారో చూద్దాం.

ChitFund Scam: నమ్మించి ముంచేస్తున్న చిట్ ఫండ్స్

Show comments