NTV Telugu Site icon

CM Chandrababu: ఉగాది పండుగ రోజు నుంచి పీ4 విధానం ప్రారంభించిన ఏపీ సర్కార్

Cbn

Cbn

CM Chandrababu: ఉగాది పండగ రోజున పీ- 4 విధానాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. పేదల అభివృద్ధి కోసం పీ 4 కార్యక్రమం నిర్వహిస్తుంది.. వచ్చే ఆగస్టుకి 5 లక్షల కుటుంబాలకు ధృవీకరణ.. ముందుగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్.. పీ-4పై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమాజంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండటమే పీ- 4 ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పీ-4 కోసం నిర్మాణాత్మకమైన స్థిరమైన విధానం ఉండాలి.. అర్హత ఉన్న కుటుంబాలను డేటా బేస్, హౌస్ హోల్డ్, గ్రామసభ ద్వారా గుర్తించాలి అని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూములు ఉన్న వారికి P4 నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: TPCC Mahesh Goud : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద హరీష్ రావు నిరసన… మహేష్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

ఇక, ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ టాక్స్ కట్టేవారు, కారు ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వాళ్ళు పీ-4 నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్న వారు, ఆర్థికంగా ఉన్న కుటుంబాలకు పీ4 నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలపై సర్వే చేస్తున్నాం.. ఇప్పటికే అందుతున్న పథకాలకు అదనంగా పీ-4 ద్వారా పేదలకు అదనంగా సాయం అందుతుంది అని చంద్రబాబు వెల్లడించారు.