NTV Telugu Site icon

Kondeti Chittibabu: అందుకే వైసీపీ రాజీనామా చేశా.. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

Kondeti

Kondeti

Kondeti Chittibabu: తాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వెల్లడించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడంతో రాజీనామా చేశాను అన్నారు.. సామాన్య కార్యకర్తకు ఇచ్చే గౌరవం కూడా వైసీపీలో నాకు దక్కలేదన్న ఆయన.. వైస్సార్ పార్టీలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదన్నారు.. దళితున్ని చంపిన వ్యక్తికి ఎమ్మెల్సీ.. దళితులకి శిరోముండనం చేసిన వ్యక్తికి ఎమ్మెల్యే సీటు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఇక, హౌసింగ్‌ లోన్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తనకు సామాన్య కార్యకర్తకు కూడా దక్కాల్సిన గౌరవం దక్కకపోవడంతోనే వైసీపీకి రాజీనామా చేశా.. కాంగ్రెస్‌ పార్టీలో చేరాన్నారు. ఇక, పి. గన్నవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.

Read Also: Vinod Kumar: మేడిగడ్డ కుంగడంలో ఎవరిది తప్పని ఇప్పటికి తేల్చలేదు..

కాగా, వైసీపీ టికెట్‌ దక్కకపోవడంతో.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన చిట్టిబాబు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారడం విశేషం. పి.గన్నవరం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ విజయం సాధించారు కొండేటి చిట్టిబాబు. ఇక, తాజా రాజకీయ పరిణామాలతో వైసీపీ రాజీనామా చేసి ఆ వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నవిషయం విదితమే.