Site icon NTV Telugu

Chidambaram: ” నేను అప్పుడే చెప్పాను.. నన్ను ట్రోల్ చేశారు”.. ఉగ్రదాడిపై మాజీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

Chidambaram

Chidambaram

Chidambaram: ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడిపై తాజాగా మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “దేశీయ ఉగ్రవాదం” అంశాన్ని లేవనెత్తారు. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరైతే.. దేశంలో తయారవుతున్న స్వదేశీ ఉగ్రవాదులు మరి కొందరని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని వివరించారు. “పహల్గామ్ దాడికి ముందు, తరువాత దేశంలో రెండు రకాల ఉగ్రవాదులు ఉన్నారని నేను చెప్పాను. ఒకరు విదేశీ శిక్షణ పొందిన చొరబాటుదారులైతే. మన దేశంలో తయారవుతున్న దేశీయ ఉగ్రవాదులని మరొకరని చెప్పాను. పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించాను. దేశీయ ఉగ్రవాదుల గురించి ప్రస్తావించినందుకు నన్ను ఎగతాళి చేశారు. ట్రోల్ చేశారు. దేశీయ ఉగ్రవాదులు కూడా ఉన్నారని ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ప్రభుత్వం దీనిపై మౌనంగా ఉందని నేను చెబుతున్నాను.” అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. భారతీయ పౌరులను, విద్యావంతులను సైతం ఉగ్రవాదులుగా మార్చే పరిస్థితులు ఏంటి? అని మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలనేదే ఈ ట్వీట్ ఉద్దేశ్యం మని పేర్కొన్నారు.

READ MORE: Nitish Kumar Reddy: దక్షిణాఫ్రికా సిరీస్‌కి ముందు స్క్వాడ్‌లో మార్పులు.. వైజాగ్ కుర్రాడు అవుట్..!

కాగా మరోవైపు.. ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీ పేలుళ్లను ఉగ్రవాద సంఘటనగా గుర్తించి, కేబినెట్ సమావేశంలో బాధితులకు నివాళులర్పించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మంత్రి వర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది.

Exit mobile version