Site icon NTV Telugu

OYO Rooms: ఓయో కస్టమర్లకు గుడ్ న్యూస్.. స్టే నౌ, పే లేటర్.. సరికొత్త ఫీచర్

Oyo

Oyo

ఈ మధ్య కాలంలో తమ కస్టమర్ల కోసం ‘పే లేటర్’ సదుపాయాన్ని ఈ కామర్స్ సంస్థలు తీసుకొచ్చాయి. అంటే మనకు ఏ వస్తువు కావాలో దాన్ని కొనుగోలు చేసి.. డబ్బులు నిర్ణీత సమయంలో చెల్లించడం అన్నమాట. ఇప్పుడు అదే సదుపాయాన్ని ఓయో సంస్థ కూడా తీసుకొచ్చింది. దూర ప్రయాణాలు చేసేవారికి ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ కంపెనీ అభిప్రాయపడుతోంది. ఓయో సంస్థ ప్రవేశ పెట్టిన ఈ సదుపాయం ‘స్టే నౌ, పే లేటర్’ పేరుతో ప్రచారం చేస్తుంది. ఈ ఫీచర్ తరచూ దూర ప్రయాణం చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు.. తక్షణ కాలంలో కొంతమేర ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఓయో గ్లోబల్ సీఓఓ అభినవ్ సిన్హా వెల్లడించారు.

Also Read: Minister Dadisetti Raja: పవన్‌ను సీఎం కాదు.. ఎమ్మెల్యేను చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు

అయితే కస్టమర్లు ఈ ‘స్టే నౌ, పే లేటర్’ ద్వారా గరిష్ఠంగా 5 వేల రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ రూపంలో వాడుకోవచ్చు అని తెలిపారు. ఇంకా హోటల్ రూమ్‌లో స్టే చేసిన 15 రోజుల తర్వాత బిల్ పే చేసే అవకాశం ఇచ్చింది. ఈ ఫీచర్ కోసం ఓయో యాప్ ​హోం స్క్రీన్​లో కనిపించే ‘ఎస్ఎన్‌పీఎల్’ ఫీచర్ ​ని యాక్సెస్​ చేసి, అవసరాలకు తగినట్టుగా ప్లాన్​ చేసుకోవాలి అని సీఈఓ అభినవ్ సిన్హా పేర్కొన్నారు.

Also Read: Mumbai Police: ముసలోళ్లను చంపి ముప్పై ఏళ్లుగా పరారీలోనే.. కానీ ముంబై పోలీసుల చేతికి చిక్కాడు

ఇంకా ఈ ఫీచర్ వల్ల కలిగే లాభాలు ఏమిటంటే.. ఇలా రూమ్ బుక్ చేసుకునేవారికి 65 శాతం డిస్కౌంట్‌తో పాటు 50 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా వస్తుంది. కాగా, స్టే చేసిన 15 రోజుల లోపు రూమ్ బిల్ చెల్లించకపోతే బిల్లు మొత్తంపై వడ్డీతో పాటు 250 రూపాయల లేట్ ఫీజ్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అని ఆయన వెల్లడించారు.

Exit mobile version