AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా ఓటింగ్ శాతం నమోదు అవుతోంది.. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. క్రమంగా పుంజుకుంది.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది.. అంటే ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. ఆరు గంటల్లో 40.26 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది.. ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది.. తర్వాతి స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ రికార్డ్ అయ్యింది.. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదు కాగా.. పులివెందుల నియోజకవర్గంలో 50 శాతం మేర పోలింగ్ పూర్తి అయ్యినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇక, ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం జిల్లాలవారీగా చూస్తే..
* అల్లూరి సీతారామ రాజు జిల్లా – 32.80 శాతం
* అనకాపల్లి – 37 శాతం
* అనంతపురం – 39.82 శాతం
* అన్నమయ్య – 39.60 శాతం
* బాపట్ల – 44.45 శాతం
* చిత్తూరు – 44.50 శాతం
* కోనసీమ – 44.03 శాతం
* తూ.గో. జిల్లా – 38.54 శాతం
* ఏలూరు – 38.76 శాతం
* గుంటూరు – 40.12 శాతం
* కాకినాడ – 38.25 శాతం
* కృష్ణా – 44.50 శాతం
* కర్నూలు – 38 శాతం
* నంద్యాల – 44.20 శాతం
* ఎన్టీఆర్ జిల్లా – 39.60 శాతం
* పల్నాడు – 40.53 శాతం
* పార్వతిపురం మన్యం – 34.87 శాతం
* ప్రకాశం – 42.78 శాతం
* నెల్లూరు – 42.38 శాతం
* సత్యసాయి జిల్లా – 38.10 శాతం
* శ్రీకాకుళం – 40.56 శాతం
* తిరుపతి – 39.14 శాతం
* విశాఖపట్నం – 33.72 శాతం
* విజయనగరం – 40.30 శాతం
* ప.గో. జిల్లా – 39.50 శాతం
* కడప – 45.56 శాతం పోలింగ్ నమోదు