Site icon NTV Telugu

Snakes: ఓ ఇంట్లో బాత్రూమ్లో 30కి పైగా పాములు.. చూస్తే గూస్బంప్సే

Snake

Snake

పాములంటే సాధారణంగా అందరికీ భయమే.. వాటిని చూస్తే కొందరికైతే చెమటలు పట్టేస్తాయి. ఎక్కడో దూరం నుంచి చూసినా కానీ.. కొందరు భయపడిపోతారు. అయితే.. సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో వస్తుండటంతో కాస్త భయం తగ్గుతుంది. అయినప్పటికీ రియల్గా పామును చూస్తే భయపడే వారు ఎంతో మంది ఉన్నారు.

Read Also: Sowmya Accident : అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మరో తెలుగు బిడ్డ..

అసలు విషయానికొస్తే.. అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు.. ఓ ఇంట్లో 30కి పైగా పాములు బాత్రూమ్ నుండి బయటకు వచ్చాయి. ఇవి చూసి ఇంట్లో ఉన్నవారు కంగుతిన్నారు. వెంటనే స్థానికులు ఈ సమాచారం అందుకుని పాములను చూసేందుకు ఎగబడ్డారు. వాటిని చూసిన స్థానికులు భయంతో బెదిరిపోయారు. తమ బాత్‌రూమ్‌లో పాములు కనిపించాయని స్థానికులు తెలిపారు.

Read Also: Pakisthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి

మరోవైపు.. పాముల గురించి పాము రక్షకుడికి సమాచారం అందించారు. అతని అక్కడికి చేరుకుని వాటిని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లాడు. ఆ పాములను ‘సర్పమ్ మ్యాన్’ అని పిలుస్తారని పాము రక్షకుడు సంజీబ్ దేకా తెలిపాడు. అంతకుముందు.. అతను కలియాబోలోని టీ ఎస్టేట్ నుండి 55 కిలోల కంటే ఎక్కువ బరువున్న 14 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువను రక్షించినట్లు చెప్పాడు.

Exit mobile version