NDA Meet: ప్రధాని మోడీ సమక్షంలో 38 పార్టీలతో ఎన్డీయే కూటమి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDA Meet: దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీయే బల నిరూపణగా భావించే ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని హోటల్ అశోకకు చేరుకున్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రధాని మోడీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘనస్వాగతం పలికారు. భారత్ అంతటా విస్తరించి ఉన్న తమ కూటమి భాగస్వాములతో నేడు సమావేశం జరగనుండటం సంతోషంగా ఉందని భేటీకి ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరడానికి, దేశ అభివృద్ధికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు కూటమిలో ఉన్న పార్టీల నేతలు ప్రధాని మోడీకి పూల మాలతో సత్కరించారు.
Also Read: Madhyapradesh: భార్యకు బలవంతంగా మూత్రం తాగించిన వ్యక్తి అరెస్ట్
Also Read
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
- Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏను గట్టెక్కించడానికి, అభివృద్ధి చెందుతున్న మహా ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి బీజేపీ కొనసాగుతున్న ప్రయత్నాలలో ఈ సమావేశం ఓ భాగమని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమికి హాజరైన పార్టీలు చాలావరకు చిన్న పార్టీలు. తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలు కాగా.. మరికొన్నింటికి అసలు ఎంపీలే లేరు. ఏదైమైన ఈ భేటీతో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో తేల్చుకునే అవకాశంగా ఈ భేటీని చిన్న పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. యూపీ, బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో తమ పట్టును నిలుపుకునేందుకు అన్ని చర్యలు చేపడుతోంది.
Also Read: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పురుషుల నగ్న నిరసన.. ఎందుకంటే?
ఎన్డీయే భేటీలో పాల్గొన్న పార్టీలు ఇవే..
బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే గ్రూప్), ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అజిత్ పవార్), ఏఐఏడీఎంకే, అప్నా దళ్, ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ, మేఘాలయ), ఎన్డీపీ (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ), లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్), ఏజేఎస్‌యూ (ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్), ఎస్కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా), ఎంఎన్ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్), ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర), ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ, మేఘాలయ), ఆర్పీఐ(రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా), ఏజీపీ (అసోం గణ పరిషత్), పీఎంకే (పట్టాలి మక్కల్ కట్చి), టీఎంసీ (తమిళ మనీలా కాంగ్రెస్), (యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, అస్సాం), ఎస్బీఎస్ఏపీ (సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఓం ప్రకాష్ రాజ్‌భర్) సమావేశానికి హాజరయ్యాయి.
ఆ పార్టీలతో పాటు శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్, ధాడియాల్), ఎంజీపీ (మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ), జేజేపీ (జననాయక్ జనతా పార్టీ), రాష్ట్రీయ లోక్ జన శక్తి పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, జన్ సురాజ్య శక్తి పార్టీ, కుకీ పీపుల్ కూటమి, యునైటెడ్ డెమోక్రటిక్ మేఘాలయ, నిషా, హెచ్ఎస్పీడీపీ, నిషా , అఖిల భారతీయ ఎన్ఆర్ కాంగ్రెస్, హెచ్ఏఎం (జీతన్ రామ్ మాంఝీ), జనసేన పార్టీ, హర్యానా లోక్ హిట్ పార్టీ, భరత్ ధర్మజన్ సేన, కేరళ కామ్రాజ్ కాంగ్రెస్, పుతియా తమిళగం, గోరఖా ఎన్ఎల్ఎఫ్ పార్టీలు కూడా సమావేశానికి హాజరయ్యాయి.
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!