Ooru Peru Bhairavakona Straming on Amazon Prime: మహాశివరాత్రి సందర్భంగా నేడు విభిన్న కథలతో తెరకెక్కిన గామి, భీమా సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అయ్యాయి. మరోవైపు ఓటీటీలో కూడా మూడు హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఊరి పేరు భైరవకోన, మేరీ క్రిస్‌మస్, అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. హిట్ సినిమా ‘హనుమాన్’ కూడా స్ట్రీమింగ్‌కు వస్తోందని అన్నారు కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. ఓటీటీల్లోకి వచ్చిన మూడు సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన హారర్ సినిమా ‘ఊరి పేరు భైరవకోన’. వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 16న రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఈ సినిమాకు అనుకున్నంత వసూళ్లు మాత్రం రాలేదు. థియేటర్‌లో రిలీజ్ అయిన 21 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: Gaami Twitter Review: ‘గామి’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ మంచి హిట్ కొట్టాడు!
ఫిబ్రవరిలో రిలీజైన మలయాళ హిట్ సినిమా ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ఇది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘మేరీ క్రిస్‌మస్’. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. హిందీ, తమిళంలో మాత్రమే విడుదల అయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోనూ హిందీ, తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.