ఈ మధ్య టాలీవుడ్ లో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే ఎక్కువగా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఇక ఓటీటీలో కూడా చిన్న సినిమాల హవా కొనసాగుతుంది.. ఇప్పుడు ప్రతి వారం ఓటీటీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల అవుతుంటాయి.. తాజాగా ‘బేబి’ సినిమాతో పాపులర్ అయిన విరాజ్ అశ్విన్ నటించిన జోరుగా హుషారుగా అనే సినిమా తాజాగా విడుదలై ఓ మాదిరి టాక్ ను అందుకుంది..
అనుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పూజిత పొన్నాడ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. నిరీష్ తిరువిధుల నిర్మించిన ఈ సినిమా గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమాలో చక్కని లవ్ స్టోరీతో పాటుగా తండ్రి కొడుకుల మధ్య అనుబందాన్ని ఈ సినిమాలి చూపించారు.. థియేటర్ లలో ఈ సినిమా పెద్దగా ఆడినట్లు కనిపించలేదు.. కానీ ఇప్పుడు తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. కుటుంబ పోషణ కోసం అప్పు తీసుకోవడం, తన బాస్ తన గర్ల్ ఫ్రెండ్ ను ప్రేమించడం, ఆ తర్వాత అప్పును ఎలా తీర్చాడు అనేది ఈ సినిమా కథ..తన లవ్‌స్టోరీ సాఫీగా ముందుకు వెళ్లిందా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమాను మీరు ఓటీటీలో చూడాల్సిందే.. అక్కడ హిట్ కాకున్నా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు ఉన్నాయి.. ఈ తన లవ్‌స్టోరీ సాఫీగా ముందుకు వెళ్లిందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటిలో సినిమాను చూసేయ్యండి..