NTV Telugu Site icon

Joshimath : శరవేగంగా కుంగుతున్న జోషిమఠ్.. షాక్ పుట్టిస్తున్న ఛాయా చిత్రాలు

Joshimath

Joshimath

Joshimath : ప్రముఖ పర్యాటక కేంద్రం జోషిమఠ్ శరవేగంగా కుంగిపోతుంది. తాజాగా డిసెంబర్ 27 – జనవరి 8 మధ్య పట్టణం 5.4 సెం.మీ. మేరకు కుంగినట్లు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉపగ్రహ చాయా చిత్రాలను విడుదల చేసింది. గతేడాది జోషిమఠ్ ఏప్రిల్-నవంబర్ మధ్య 9సెం.మీ మేర కుంగింది. ఆర్మీ హెలిప్యాడ్, దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతంలోని సెంట్రల్ జోషిమఠ్‎లో మట్టిని వేగంగా తరలించడం జరిగింది. 2,180 మీటర్ల ఎత్తులో జోషిమఠ్-ఔలీ రహదారికి సమీపంలో ఈ క్షీణత ఉందని ఇస్రో నివేదిక పేర్కొంది. అంతకుముందు నెలల్లో కుంగిన రేటు చాలా తక్కువగా ఉందని ఏజెన్సీ నివేదించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నివేదిక ప్రకారం ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ కేవలం 12 రోజుల్లో 5.4 సెం.మీ. కుంగినట్లు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.

Read Also: Dadisetti Raja: పవన్ కళ్యాణ్ హవాలా చేస్తూ దొరికిపోయాడు

జోషిమఠ్ మాత్రమే కాకుండా ఆ రాష్ట్రంలోని బద్రీనాథ్‎కు ముఖద్వారంగా భావిస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉందని డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ గుర్తించింది. ఆయా పట్టణంలోని భవనాలు, రోడ్లలో భారీ పగుళ్లు ఏర్పడటంతో విపత్తు అంచున ఉంది. శాటిలైట్ సర్వే తర్వాత దాదాపు 4,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. హోటళ్లు, వ్యాపార సంస్థలతో పాటు 678 గృహాలు ప్రమాదంలో ఉన్నాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.

Read Also: NTR: మాస్ హీరో క్లాస్ అవతారం ఎత్తి ఏడేళ్లు…

ప్రణాళిక లేని, అస్తవ్యస్తమైన ప్రాజెక్టులే సంక్షోభానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. గురువారం జోషిమఠ్‌ను సందర్శించి స్థానికులు, నిపుణులతో సమావేశాలు నిర్వహించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, బాధిత కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం రేటును వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు.

Read Also: Mahesh Babu: ఇలాంటి క్యారెక్టర్ ఇంకొకటి చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా

ప్రస్తుతానికి, ప్రతి బాధిత కుటుంబానికి తాత్కాలిక పరిహారం కింద రూ.లక్షన్నర ప్రకటించారు. ఇంకా నష్టపరిహార రేట్లపై కసరత్తు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తరఫున ఆయన ప్రకటించారు. హోం మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ఆర్కే సింగ్, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, సీనియర్ ప్రభుత్వ అధికారులతో పరిస్థితిని సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.