Site icon NTV Telugu

Osmania University: తెరపైకి ఓయూ భూవివాదం.. విద్యార్థి సంఘాల ఆగ్రహం

Osmania University

Osmania University

ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం ఇంకా పరిష్కారం కాకముందే.. ఓయూ భూవివాదం తెరపైకి వచ్చింది. ఓయూ ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వస్తున్నాయి.

READ MORE: Tej Pratap Yadav: ఆర్జేడీ నుంచి కొడుకును బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్..

ప్రైవేట్ వ్యక్తులకు క్వార్టర్స్ ఇవ్వడంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం నిజమేనని ఓయూ వీసీ (వైస్ చాన్సలర్) స్వయంగా అంగీకరించారు. అయితే, గతంలో ఇన్‌ఛార్జి వీసీగా ఉన్న వ్యక్తి ఈ క్వార్టర్స్‌ను అప్పగించారని ప్రస్తుతం ఉన్న వీసీ వెల్లడించారు. మినిట్స్ బుక్‌లో ఈ విషయాన్ని తనూ చూసినట్లు పేర్కొన్నారు.

READ MORE: Breaking News : కేటీఆర్, కేసీఆర్ భేటీ.. కవిత లేఖ, కాళేశ్వరం నోటీసులపై కీలక చర్చలు

విద్యార్థి సంఘాలు మాత్రం ఇది నిబంధనలకు విరుద్ధమని అంటున్నాయి. రూల్ ప్రకారం ఓయూ క్వార్టర్స్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదని స్పష్టం చేస్తున్నాయి. అదనంగా, ఓయూ ప్రొఫెసర్లు ఈ క్వార్టర్స్ లో నివాసముంటే నెలకు ₹40,000 కట్ చేస్తారని చెప్పుతున్నారు. దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కేవలం ₹1,000కి ఇవ్వడమేంటని వారు నిలదీశారు. ఈ అంశంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

READ MORE: NDA: ప్రధాని మోడీ, భారత సైన్యాన్ని అభినందిస్తూ ఎన్డీయే తీర్మానం..

Exit mobile version