Site icon NTV Telugu

Telangana: గురుకులాలు, హాస్టళ్లలో ఇకపై ఫుడ్‌ సేఫ్టీ కమిటీలు..

Telangana Gurukulas

Telangana Gurukulas

పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ కమిటీలు పరిశీలించనున్నాయి. విద్యా సంస్థల్లో స్కూల్ హెడ్ మాస్టర్‌, గురుకుల్లాలో వార్డెన్‌తో పాటు మరో ఇద్దరు ఈ కమిటీలో ఉంటారు. వీరు ప్రతిరోజూ వంట చేయడానికి ముందు స్టోర్ రూం, కిచెన్‌ను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే వంటకాలను రుచి చూసి నాణ్యతను నిర్ధారించాలని పేర్కొంది. ఆ తర్వాతే పిల్లలకు ఆహారం పెట్టాలని ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే.. ఆహార పదార్థాల ఫోటోలను ఉన్నతాధికారులకు పంపించాలని ప్రభుత్వం నియమ నిబంధలను పెట్టింది.

Read Also: Minister Nadendla Manohar: రైతులకు అండగా ఉంటాం.. దళారులను ప్రోత్సహించొద్దు..

రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి వివిధ విద్యా సంస్థలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఇటీవలే ఓ విద్యార్థి కూడా మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఆహార పదార్థాలకు సంబంధించి.. నాణ్యమైన, పౌష్టికమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని తెలిపింది. 2011 నుంచి ఈ కమిటీలు ఉన్నాయి.. మరోవైపు విద్యాశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు సందర్శించి.. అక్కడ మధ్యాహ్నం భోజనం వడ్డించే తీరు, మిగతా అంశాలను పరిశీలించారు. అనంతరం.. నివేదికలను ప్రభుత్వానికి పంపించనున్నారు.

Read Also: Waqf Bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ పదవి కాలం పొడగించిన పార్లమెంట్..

Exit mobile version