Heavy Rains: తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
- తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
- రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పొంగిపొర్లుతున్న వాగులు.. వంకలు
- హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పది జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ ఐఎండీ అలెర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా.. ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు.. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
YS Jagan: ముగిసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
కాగా.. ఈరోజు సాయంత్రం లోపు అల్పపీడనం తీరం దాటనున్నది. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా వరంగల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు.. ఉత్తర తెలంగాణలో ఈ నెల 20 , 21వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్గా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. నిన్న (శుక్రవారం) రాత్రి కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు.
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!