కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్ష నేతల తొలి రోజు సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై దాదాపు రెండు గంటలకు పైగా నేతలందరూ చర్చించారు. రేపు (మంగళవారం) మరోసారి భేటీ కానున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని నిలువరించే అంశాలతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు. ఇప్పటికే ఓసారి పట్నాలో విపక్షాలు మీటింగ్ జరిగింది. మహారాష్ట్రలోని ఎన్సీపీలో తిరుగుబాటు, బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల్లో హింసకు టీఎంసీనే కారణమంటూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పాడింది.
Read Also: MBBS Student Missing: జార్జియాలో తెలుగు విద్యార్థి అదృశ్యం
ఈసారి బెంగళూరులో జరిగిన ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్‌సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎండీకే ప్రధాన కార్యదర్శి వైకోతో పాటు మొత్తం 26 పార్టీలకు చెందిన 53 మంది ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Read Also: Adivi Sesh: మళ్లీ డైరెక్షన్ చేయబోతున్న అడివి శేష్?
బెంగళూరు వేదికగా జరుగుతోన్న విపక్షాల తొలిరోజు సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గైర్హజరు అయ్యారు. దీంతో ఆయనపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ క్లారిటీ ఇచ్చింది. రెండో రోజు మీటింగ్ కు తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి శరద్ పవార్ విపక్షాల భేటీకి వస్తారని తెలిపింది. అయితే, తొలి రోజు సమావేశంతో పాటు విందుకు ఎందుకు హాజరుకాలేదనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి స్టార్ట్ అవుతుండటంతో పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడంతో పాటు సభలో జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలించాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
