10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Watch 5 Launched: చైనాలో ఒప్పో రెనో17 సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు ఒప్పో కొత్త స్మార్ట్‌వాచ్ ఒప్పో వాచ్ 5 (OPPO Watch 5)ను కూడా లాంచ్ చేసింది. చూడతగ్గ డిజైన్, AMOLED డిస్ప్లే, అధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ అమ్మకాలు నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
డిజైన్ & డిస్ప్లే
ఈ ఒప్పో వాచ్ 5 స్క్వేర్ డిజైన్‌తో వచ్చింది. ఇందులో ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్, GG5 గ్లాస్ ప్రొటెక్షన్ అందించారు. ఈ వాచ్ మందం కేవలం 9.2mm కాగా, స్ట్రాప్ లేకుండా 25 గ్రాముల బరువు ఉంటుంది. 5ATM వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు IP69, IP69K రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.85 అంగుళాల AMOLED డిస్ప్లే ఇచ్చారు. ఇది 390 × 450 పిక్సెల్స్ రిజల్యూషన్, 322ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. సాధారణంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుండగా, హై బ్రైట్నెస్ మోడ్‌లో 1,500 నిట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్ మోడ్‌లో గరిష్ఠంగా 3,000 నిట్స్ బ్రైట్నెస్ లభిస్తుంది.
Also Read
- Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
- Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
- Apple Health AI App: ChatGPTకి పోటీగా Apple కొత్త AI హెల్త్ యాప్.. వైద్య పరిశోధనలతో ఆరోగ్య సమస్యలకు సమాధానాలు!
- Nvidia CEO Comeback: Nvidia CEOగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ? ఎలాన్ మస్క్ మద్దతు.. మళ్లీ పగ్గాలు చేపడతారా?
వినియోగదారులు తమ ఫొటోలు, స్టిక్కర్లతో వాచ్ ఫేస్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు. మూడ్ ఆధారిత లేఅవుట్లు, ఫొటో కొలాజ్ డిజైన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా 3,000కు పైగా వాచ్ ఫేస్‌లను అందిస్తోంది. వీటిలో 30కి పైగా ప్రత్యేక టెంప్లేట్లు ఉన్నాయి. ఇతరులు రూపొందించిన వాచ్ ఫేస్‌లను షేర్ కోడ్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.
100+ స్పోర్ట్స్ మోడ్లు
ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారి కోసం ఒప్పో వాచ్ 5లో 100కు పైగా వర్కౌట్ మోడ్లు అందించారు. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, రోయింగ్, హైకింగ్, స్కీయింగ్ వంటి కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చు. వాకింగ్, ఫిట్నెస్ యాక్టివిటీస్, సైక్లింగ్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించే ఫీచర్ కూడా ఉంది. ట్రెడ్మిల్ ఇన్‌క్లైన్ వర్కౌట్స్‌కు సైతం సపోర్ట్ చేస్తుంది. ఇందులో కొత్తగా FatMax మోడ్‌ను అందించారు. ఇది వినియోగదారుల ఫిట్నెస్, యాక్టివిటీ డేటా ఆధారంగా వ్యక్తిగత హార్ట్‌రేట్ పరిధిని గుర్తించి, కొవ్వును కరిగించడానికి అనుకూలమైన వ్యాయామ తీవ్రతను సూచిస్తుంది. వర్కౌట్ సమయంలో రియల్ టైమ్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు, వ్యాయామం తర్వాత ఫ్యాట్ బర్నింగ్ పనితీరును విశ్లేషిస్తుంది. మహిళల కోసం మెన్స్ట్రువల్ సైకిల్ ఆధారంగా వ్యాయామ సూచనలు, శిక్షణ తీవ్రతను కూడా సిఫార్సు చేస్తుంది.
అధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు
ఆరోగ్య పర్యవేక్షణ కోసం రోజంతా హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను కొలిచే సదుపాయం ఉంది. అలాగే మణికట్టు ఉష్ణోగ్రత కొలత, స్లీప్ అనాలిసిస్, స్లీప్ క్వాలిటీ స్కోరింగ్, నిద్ర సమయంలో శ్వాస సంబంధిత ప్రమాదాల అంచనా, మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, గుండె స్పందనలో అసాధారణ రిథమ్‌లను గుర్తించే సామర్థ్యం కూడా ఉంది. అంతేకాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలను 24 గంటల పాటు విశ్లేషించి రోజువారీ వెల్నెస్ సూచనలు అందిస్తుంది. ఈ ఆరోగ్య ఫీచర్ల అభివృద్ధిలో వైద్య, పరిశోధనా సంస్థల సహకారం తీసుకున్నట్లు ఒప్పో వెల్లడించింది.
బ్యాటరీ, కనెక్టివిటీ
ఒప్పో వాచ్ 5లో 351mAh సాధారణ సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. సాధారణ వినియోగంలో 7 రోజుల వరకు, Always-on Display ఆన్‌లో ఉంటే 3 రోజుల వరకు పనిచేస్తుంది. మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సుమారు 90 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ వాచ్‌లో Bluetooth 5.2, NFC కనెక్టివిటీ ఉన్నాయి. BeiDou, GPS, Galileo, GLONASS, QZSS నావిగేషన్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అయితే Wi-Fi, eSIM సదుపాయాలు లేవు. ఆండ్రాయిడ్ 10, అంతకంటే పై వెర్షన్లు, iOS 16, అంతకంటే పై వెర్షన్లతో పనిచేస్తుంది. ColorOS Watch 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
ధర
OPPO Watch 5 ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. నవంబర్ 20 నుంచి షిప్మెంట్లు ప్రారంభం కానున్నాయి. దీని ధరలు ఇలా ఉన్నాయి.
* పర్పుల్ ఎన్కౌంటర్: 999 యువాన్లు (సుమారు 150 డాలర్లు / రూ.14,060).
* మూన్లైట్ వైట్: 899 యువాన్లు (సుమారు 135 డాలర్లు / రూ.12,650).
* ఫెయిరీ ట్రైల్ గ్రీన్: 899 యువాన్లు (సుమారు 135 డాలర్లు / రూ.12,650).
* విషింగ్ ఆరెంజ్: 899 యువాన్లు (సుమారు 135 డాలర్లు / రూ.12,650).
* స్టార్‌షైన్ బ్లాక్: 899 యువాన్లు (సుమారు 135 డాలర్లు / రూ.12,650).
ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్ చైనా మార్కెట్లో మాత్రమే లాంచ్ అయింది. భారత మార్కెట్లో విడుదలకు సంబంధించి ఒప్పో ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
తాజావార్తలు
-
Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Cyclone Akwan Alert: అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
-
Modi-Trump Meeting in Manila: మోడీతో ట్రంప్ కీలక భేటీ.. మనీలాలో క్వాడ్ సమ్మిట్‌లో ఏం జరగబోతోంది?
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!