OPPO: ఒకేసారి కొత్త ఫోన్, టాబ్లెట్, ఇయర్‌బడ్స్లను గ్లోబల్గా విడుదల చేయనున్న ఒప్పో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO: ఒప్పో (OPPO) మరోసారి తన కొత్త గ్యాడ్జెట్‌లను మే 15న చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్‌లో ఒప్పో Reno14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, OPPO Pad SE టాబ్లెట్, OPPO Enco Clip ఓపెన్-ఇయర్ TWS ఇయర్‌బడ్స్‌లను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే లీకైన డిజైన్ ప్రకారం OPPO Reno14 ఫోన్‌లో రెండు పెద్ద కెమెరా సెన్సార్లు, ఒక చిన్న సెన్సార్ ఉండనుంది, ఇవి Reno13 డిజైన్‌ను తలపిస్తాయి. అయితే కొత్త డెకో కొద్దిగా చిన్నదిగా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌కి తాజా మీడియాటెక్ Dimensity 8450 ప్రాసెసర్ అందించనున్నారు. 6.59 అంగుళాల 1.5K LTPS ఫ్లాట్ స్క్రీన్, 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం 50MP ఆటోఫోకస్‌తో ఉండబోతుంది. అలాగే ఫోన్‌కు 6000mAh కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. ఇంకా IP66, IP68, IP69 రేటింగ్‌లతో ధూళి, నీటి నుండి రక్షణ అందించనుంది.
Read Also: Vivo X200 FE: భారత్‌లో విడుదలకు సిద్ధం అయిన కొత్త ఫ్లాగ్‌షిప్ వివో X200 FE ఫోన్.!
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
OPPO Pad SE:
OPPO Pad SE టాబ్లెట్ 11 అంగుళాల ‘సాఫ్ట్ లైట్ ఐ ప్రొటెక్షన్’ స్క్రీన్‌తో రానుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థుల కోసం రూపొందించబడిన ‘లెర్నింగ్ స్పేస్’ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 9340mAh భారీ బ్యాటరీ అందించనున్నారు. ఈ టాబ్లెట్ స్టార్‌లైట్ సిల్వర్, నైట్ బ్లూ కలర్స్‌లో లభించనుంది.
Read Also: Rohit Sharma Test Retirement: అభిమానులకు భారీ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ!
OPPO Enco Clip:
OPPO Enco Clip ఓపెన్-ఇయర్ TWS ఇయర్‌బడ్స్ తక్కువ బరువుతో ఉండేలా డిజైన్ చేయబడ్డాయి. ఇవి అధిక స్పష్టత కలిగిన సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9.5 గంటల వరకు ప్లేబ్యాక్ సపోర్ట్ ఇస్తాయి. ఇవి పెర్లెసెంట్ సీ, స్టార్ రాక్ గ్రే అనే కలర్ వేరియంట్లలో వస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ ఒరిజినల్ సౌండ్, హై డెఫినిషన్ ఎనలిసిస్, ప్యూర్ వొకల్స్, సర్జింగ్ బాస్ వంటి నాలుగు రకాల ట్యూనింగ్ మోడ్‌లను సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు వీటిలో రిమోట్ ఫోటోగ్రఫీ, AI కాల్ సమరీ కంట్రోల్, స్పేషియల్ సౌండ్ ఎఫెక్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!