Vivo X200 FE: భారత్‌లో విడుదలకు సిద్ధం అయిన కొత్త ఫ్లాగ్‌షిప్ వివో X200 FE ఫోన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo X200 FE: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (vivo) తన X200 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. లీకైన సమాచారం ప్రకారం vivo X200 FE పేరుతో ఈ ఫోన్‌ను 2025 జులైలో భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌కి 6.31 అంగుళాల 1.5K 120Hz AMOLED డిస్‌ప్లే ఉండనుందని సమాచారం. ఇదివరకు రూమర్లలో వినిపించిన vivo X200 Pro Mini భారత్‌లో విడుదల కానుందని భావించగా అది జరగలేదు. కానీ, ఇప్పుడు అదే ఫోన్ డిజైన్‌ను కలిగి ఉండే X200 FE భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఇదివరకు అనుకున్న Dimensity 9400 స్థానంలో, Dimensity 9300+ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. లేదా Dimensity 9400e అనే కొత్త చిప్ వేరియంట్‌ను కూడా వాడే అవకాశం ఉంది.
Read Also: Asaduddin Owaisi: వైమానిక దాడిలో ఉగ్రవాదుల హతం… అసదుద్దీన్ ఒవైసీ వీడియో వైరల్!
Also Read
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
వివో X200 FEలో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP సోనీ 3X టెలిఫోటో కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉండనుందని సమాచారం. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది గొప్ప అప్షన్ కానుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉండనుంది. అంటే ఇది నీరు, ధూళి నుంచి మంచి రక్షణను అందించనుంది. X200 FEలో 6500mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది X200 Pro Miniలో ఉన్న 5700mAh కన్నా ఎక్కువ. ఈ బ్యాటిరికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 12GB + 256GB, 16GB + 512GB వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు రూ. 50,000 నుంచి 60,000 మధ్య ఉండొచ్చని అంచనా. అధికారికంగా ఈ మొబైల్ జులై 2025లో విడుదల కానుంది. చూడలి మరి టెక్ ప్రియులను ఈ ఫ్లాగ్‌షిప్ వివో X200 FE ఫోన్ ఎంతవేళకు ఆకట్టుకోగలదో.
తాజావార్తలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!