New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఒప్పో (Oppo), వన్‌ప్లస్ (OnePlus) బ్యాటరీ సామర్థ్యం విషయంలో మొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపనున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో లీక్ అయిన తాజా సమాచారం ప్రకారం.. ఈ రెండు కంపెనీలు ఏకంగా 10,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీలతో సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
ప్రస్తుతం వన్‌ప్లస్ సంస్థ ఈ 10,000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌పై ప్రాథమిక పరిశోధన దశలో ఉందని తెలుస్తోంది. అయితే, ఈ వివరాలను ఏ సంస్థా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఒప్పో తన ప్రసిద్ధ ‘A’ సిరీస్‌లో భాగంగా 10,000mAh సింగిల్-సెల్ బ్యాటరీతో కూడిన ఫోన్‌ను మొదటగా విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు వన్‌ప్లస్ వచ్చే ఏడాది ‘ప్రో’ బ్రాండింగ్‌తో, మోడల్ నంబర్ SM8845 తో ఒక సరికొత్త మిడ్-రేంజ్ ఫోన్‌ను 10,000mAh కన్నా పెద్ద బ్యాటరీతో లాంచ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది.
Also Read
- Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
- Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
ఇదే నిజమైతే ఈ రెండు ఫోన్లు ఆయా సంస్థల చరిత్రలోనే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్లుగా రికార్డు సృష్టిస్తాయి. గతంలో ఒప్పో తన ఒప్పో A6 ప్రో 5G ఫోన్‌ను 7,000mAh బ్యాటరీతో, 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో విడుదల చేయగా, దీని ప్రారంభ ధర 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.21,999 గా ఉంది.
అదేవిధంగా, వన్‌ప్లస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ 6 లో ఆ సంస్థ చరిత్రలోనే అత్యంత భారీ బ్యాటరీ అయిన 9,000mAh బ్యాటరీని పరిచయం చేసింది. ఇది కూడా 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999 గా ఉంది. ఈ క్రమంలో ఈ రెండు బ్రాండ్లు మరింత శక్తివంతమైన 10,000mAh బ్యాటరీలతో ఫోన్లను తీసుకువస్తుండటం స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
-
The Odyssey: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ‘ది ఒడిస్సీ’ టికెట్లు! లక్షకు పైగా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!