మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.. ఇటీవల ఎఫ్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేకపోయింది.. ఆ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రస్తుతం వరుణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే స్పై యాక్షన్ సినిమా చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది.
ఇక ఆ సినిమా తర్వాత వరుణ్ 13వ సినిమాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. వరుణ్ తేజ్ 13వ సినిమాని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ తో గని సినిమా నిర్మించిన రెనైసెన్స్ పిక్చర్స్ ఈ సినిమాని సోని పిక్చర్స్ తో కలిపి నిర్మిస్తుంది. ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ నటిస్తుంది..
తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్రయూనిట్. వరుణ్ తేజ్ సినిమాకు ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ ని ప్రకటించారు. టైటిల్ కొత్తగా డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది. ప్రేమ యుద్ధం కలిపి ఉండబోతుందా కథ అని భావిస్తున్నారు ఆడియన్స్. మరి ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో కొత్తగా ప్రయోగం చేస్తున్న వరుణ్ తేజ్ ఎలాంటి కథతో వస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఈ సంవత్సరం వరుణ్ వి రెండు సినిమాలు రానున్నాయి.. రెండు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..
On the 8th of December 2023,
Hear the roar of India as it echoes across the skies.#OperationValentine 🇮🇳@ShaktipsHada89 @ManushiChhillar @sidhu_mudda @sonypicsfilmsin @RenaissancePicz@dophari @SonyPicsIndia pic.twitter.com/LYNDftJPQ1— Varun Tej Konidela (@IAmVarunTej) August 14, 2023