NTV Telugu Site icon

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద H బ్లాక్‌ ఆపరేషన్ ప్రారంభం

Prakasam Barrage

Prakasam Barrage

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు H బ్లాక్‌ ఆపరేషన్ ప్రారంభమైంది. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు అడ్డం పడిన బోట్ల తొలగింపు.. రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. 7 రోజులుగా దశలవారీగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా.. వాటర్‌ లోడింగ్ ప్లాన్‌(H బ్లాక్‌ ఆపరేషన్) అమలు చేయాలని పని చేస్తున్న బృందం నిర్ణయించింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన బోటు కొంత మేరకు మాత్రమే ముందుకు కదులుతుండడంతో ఈ ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో బోట్లను లాగడానికి గొల్లపూడి నుంచి ఆరేడు కార్గో బోట్లను రప్పించారు.

Read Also: Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైల్ పేరు మారింది.. ఇకపై ఇలా పిలవాలి..

వీటిలో రెండింటిని పూర్తిగా నీటితో నింపి.. మునిగి ఉన్న బోటుతో లాక్‌ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ బోట్లు నీళ్లలోకి దిగుతాయి. అనంతరం వాటిలో ఉన్న నీటిని తోడేస్తారు. ఈ క్రమంలో ఆ పడవలు పైకి వచ్చే సమయంలో నీటిలో మునిగిన బోటు కూడా పైకి లేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రణాళిక ఫలితాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. నీళ్లలో మునిగిన బోట్లను పైకి లేపడానికి బెలూన్ టెక్నాలజీ ఉన్నా అది ఇలాంటి చోట్ల పనిచేయదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు బోట్ల సాయంతో బ్యారేజీని ఢీకొన్న బోట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

 

Show comments