Operation Sindoor: “ఆపరేషన్ సింధూర్” తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, అమెరికా మధ్యవర్తిత్వం వహింపుతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సమ్మతించాయి. అయితే, ఈ కాల్పుల విరమణ చేపట్టిన కొద్ది సేపటికే పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆ దాడులను తిప్పికోట్టింది. ఇకపోతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత బోలెడు అబ్దాలు చెప్పింది. ఆ అబద్దాలను భారత సైన్యం ఆధారాలతో సహా నిరూపించింది. మరి ఆ అబద్దాలేంటో చూద్దామా..
Read Also: Akanda 2 : వెయ్యి మందితో బాలయ్య యాక్షన్ సీన్..?
* పాకిస్తాన్ ఛానెల్ ఇండియాకు చెందిన రెండు రాఫెల్ జెట్స్ ను కూల్చేశామని చెప్పింది. కానీ, ఇండియా జెట్స్ కు ఏమీ కాలేదు
* మే 7న ఇండియా పాకిస్తాన్, POKలోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేయగా అందులో 100కు పైగా ఉగ్రవాదుల్లో చనిపోయారు. అయితే, పాక్ 24 మంది చనిపోయారని.. 46 మంది గాయపడ్డారని చెప్పింది.
* ఇండియా డ్రోన్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ .. పాక్ ఆర్మీ తమ లొకేషన్ బయటపెట్టడం ఇష్టం లేక కూల్చలేదని ఆసిఫ్ తెలిపారు.
* ఇక దాడులు జరిగిన ప్రదేశంలో ఏడుస్తున్న పిల్లలు, ధ్వంసమైన మసీదుల ఫోటోలు పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి గాజా, సిరియా, యెమెన్ కు సంబంధించినవని మాట మార్చింది.
Read Also: RRB ALP Recruitment 2025: గుడ్ న్యూస్.. 9970 పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ పొడిగింపు..!
* ఇండియా దాడిని తక్కువ చేసి చూపించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ముందుగా 3 చోట్ల దాడి జరిగిందని చెప్పింది. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ 6 చోట్ల 24 దాడులు జరిగాయని చెప్పారు.
* పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బ్లూమ్బిర్గ్ కు ఇండియన్ ఫైటర్ జెట్ని కూల్చేశామనీ, ఇండియన్ సైనికుల్ని బంధించామని చెప్పారు. ఆధారాలడిగితే చూపించలేకపోయారు.
* ఇండియన్ విమానం కూలిపోయిందని చూపించడానికి పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.
* బటిండా, అఖ్నూర్లో రెండు మిగ్ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో 21 మే 2021 నాటిదని తేలింది.
* ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మిస్సైల్ దాడి చేసి ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెప్పింది. నిజానికి పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదానికి సంబంధించినది.
* ఉధంపూర్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేశామని, పాకిస్తాన్ లోని AIK న్యూస్ పాత వీడియో చూపించింది. అలాగే రాజస్థాన్ లోని హనుమానఢ్ 8 మే 2025న కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం వీడియో అది.
* ఇండియన్ బ్రిగేడ్ హెడ్ క్వాటర్స్ ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ మీడియా చెప్పింది. పాకిస్తాన్ ఇంటర్నెట్ యూజర్లు షేర్ చేసిన వీడియో ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్లో తేలింది.
* ఇండియా S-400, బ్రహ్మోస్ మిస్సైల్ బేస్లను JF-17 ఫైటర్ జెట్ తో ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెప్పింది. అది పూర్తిగా అబద్ధం.
* ఇండియా మసీదులను ధ్వంసం చేసిందని పాకిస్తాన్ చెప్పింది. కానీ, ఇండియా ఏ మతపరమైన స్థలాన్నీ ధ్వంసం చేయలేదు
* ఇండియా ఎయిరీఫీల్డ్స్ సిర్సా, జమ్మూ, పఠాన్కోట్, బటిండా, నలియా, భుజ్లపై దాడి చేశామని పాకిస్తాన్ చెప్పింది. అది కూడా అబద్ధమే.
