Maoists : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 22 మంది మావోయిస్టులు మృతి
- బీజాపూర్- బీజాపూర్ లోని కర్రెగుట్ట కొండలో రెండు వారాలుగా ఆపరేషన్
- బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ కర్రె గుట్టలపై ఎన్ కౌంటర్
- భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists : బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండలలో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ‘ఆపరేషన్ కగార్’గా కొనసాగుతున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా CRPF యూనిట్లు, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని గుట్టల మధ్య లోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు, ముఖ్యంగా హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టులను పట్టుకోవడం. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టుల ఉనికి ఉందన్న బలమైన సమాచారం మేరకు ముందుచూపుతో ఆపరేషన్ సాగుతోంది.
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ఈ నేపథ్యంలో కర్రెగుట్టల్లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. CRPF ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీ ఎన్కౌంటర్‌ను అధికారికంగా ధృవీకరించారు. ఇక ఓ మహిళా మావోయిస్టు మృతి చెందిన ఘటనలో అధికారులు 303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
భద్రతా బలగాలు కర్రెగుట్టల గుట్టలపై ఆధిపత్యాన్ని సాధించాయి. ధోబే కొండలు, నీలం సరాయి ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేయగా, అలుబాక శివారులో మరో క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు, సిగ్నలింగ్ టవర్లు ద్వారా మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలు భూగర్భ బంకర్ల వేట కొనసాగిస్తున్నాయి. వందల సంఖ్యలో మావోయిస్టులు ఈ ప్రాంతాల్లో బంకర్లు నిర్మించినట్లుగా సమాచారం అందడంతో, భద్రతా బలగాలు ప్రతి ఇంచు ఇంచుగా గాలిస్తున్నారు. మందుపాతరలు, IED బాంబులపై ప్రత్యేక నిఘా పెట్టి, ముందస్తు అపాయాన్ని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
CM Revanth Reddy: ఆపరేషన్ సింధూర్.. ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!