ఔరంగబాద్ లో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నక్షత్రవాడీ ప్రాంతంలో ఉండే మాజీ మేయర్ నందకుమార్ చెప్పులు ఇటీవల కనిపించకుండా పోయాయి. ఇంటి గేటు తెరిచి ఉండటంతో లోపలికొచ్చిన కుక్కలు చెప్పులు ఎత్తికెళ్లి ఉండొచ్చని సిబ్బంది అనుమానించారు. దీంతో మాజీ మేయర్ ఆగ్రహానికి గురైన నాలుగు వీధి కుక్కలకు అధికారులు స్టెరిలైజేషన్ చేశారు.
Also Read : Public Grievance Redressal: ఆ విషయంలో తెలంగాణ టాప్.. ఏపీకి పదో స్థానం
దీంతో, నంద కుమార్ మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేయడంతో.. వారు వీధికుక్కలను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ మేయర్ నివాసానికి సమీపంలో పట్టుబడ్డ నాలుగు కుక్కలకు మున్సిపల్ అధికారులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, కుక్కలకు సాధారణంగా స్టెరిలైజేషన్ చేస్తూనే ఉంటామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మాజీ మేయర్ మాత్రం మౌనం వహించడం గమనార్హం.
Also Read : Ram Charan-Upasana: అద్భుతమైన 11 సంవత్సరాలు.. ఉపాసన కొణిదెల ట్వీట్ వైరల్!
అయితే సోమవారం రాత్రి మాజీ మేయర్ నంద్‌కుమార్ ఇంటి కాంపౌండ్ గేటు తెరిచి ఉంది.. అదే రాత్రి ఇంటి గుమ్మం ముందు విడిచిన ఆయన చెప్పులు కనిపించకుండా పోయాయి.. వీధి కుక్క ఒకటి లోపలికి వచ్చి వాటిని ఎత్తుకెళ్లినట్టు ఔరంగబాద్ మున్సిపల్ అధికారి గుర్తించారు. ఇక, తర్వాత రోజు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కుక్కలను పట్టుకునే బృందం ఆ గల్లీలో తిరిగే నాలుగు కుక్కలకు పట్టుకుని వాటికి ఆపరేషన్ చేపట్టిందని వివరించారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. మాజీ మేయర్ చేసిన పనికి నెటిజన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.