Site icon NTV Telugu

Operation Abhyas: ముగిసిన ‘ఆపరేషన్‌ అభ్యాస్‌’ మాక్ డ్రిల్.. అరగంట పాటు కొనసాగిన డ్రిల్

Mock Drill

Mock Drill

Operation Abhyas: అత్యవసర పరిస్థితుల్లో ప్రజల చొరవ, సహాయక సంస్థల సమన్వయం ఎంతో అవసరం. దీనికోసం ప్రభుత్వం తరచూ నిర్వహించే విధానాలే మాక్ డ్రిల్స్. అంటే,అనుకోని ప్రమాదాలు, ఉగ్రదాడులు, సహజ విపత్తులు వంటి సందర్భాల్లో ఎలా స్పందించాలి, ఎవరెవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల్లో ముందస్తుగా ప్రాక్టీస్ చేసే కార్యక్రమాలు. ఇందులో ప్రభుత్వ విభాగాలు, సహాయక బృందాలు, ప్రజలు కలిసి పాల్గొంటారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో “ఆపరేషన్ అభ్యాస్” పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది.

Read Also: Reels Malking: రీల్స్ తీసి పెట్టండి… డబ్బులు సంపాదించండి!

మాక్ డ్రిల్ ప్రారంభంలో నగరంలోని ముఖ్య కూడళ్లలో, అపార్ట్‌మెంట్ల వద్ద సైరన్లు మోగించారు. ప్రజల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టారు అధికారులు. ప్రజలతో పాటు సహాయక సిబ్బంది కూడా ఈ డ్రిల్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ లోని నానల్‌నగర్‌, కంచన్‌బాగ్‌, సికింద్రాబాద్‌, ఈసీఐఎల్‌ ఎన్‌ఎఫ్‌సీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF), రక్షణశాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు డ్రిల్‌ను పర్యవేక్షించారు.

Read Also: Rajnath Singh: “వారే మా టార్గెట్” రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

ఇక సికింద్రాబాద్‌, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగితే ఎలాఉంటుందో.. ఊహించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 12 మంది సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు పాల్గొని సూచనలు ఇచ్చారు. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలు, అధికార సిబ్బంది అత్యవసర సమయంలో ఎలా స్పందించాలో, ఎవరి బాధ్యతలు ఏమిటన్న అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగింది.

Exit mobile version