కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్, చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు, శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి. వనాల్లో వుండాల్సిన వన్యప్రాణులు జనాల్లోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఓ ఇంటిలో తిష్టవేసిన ఎలుగు బంటి జనాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించింది. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పి.రామ్మోహనరావు (ఐఎఫ్‌ఎస్) ఆధ్వర్యంలో ఆపరేషన్ బల్లూక్ నిర్వహించారు. ఎట్టకేలకు ఎలుగుబంటిని పట్టుకుని బోనులో బంధించారు. ఆపరేషన్ లో విశాఖ జూకి చెందిన మత్తు డాక్టర్,…