Karnataka: కన్నడ మాట్లాడే వారికే కంపెనీల్లో ఉద్యోగాలు..!బెంగళూరులో ఐటీ కంపెనీల పరిస్థితేంటి?
- కర్ణాటకలోని ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు
- 100 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు
- క్యాబినెట్ నోట్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం
- ఆందోళన వ్యక్తం చేస్తున్న కంపెనీల ప్రతినిధులు
హర్యానా తర్వాత ఇప్పుడు కర్ణాటకలో కూడా ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులను మాత్రమే రిక్రూట్ చేసుకోవాలనే నిబంధనను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొల్పిన ప్రైవేట్ కంపెనీల్లో కేవలం కన్నడ మాట్లాడే వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పించాలనే క్యాబినెట్ నోట్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో కర్ణాటకలో 100 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఆ తర్వాత తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. కాగా.. బెంగళూరు ఐటీ రంగానికి ప్రసిద్ధిచెందినది. ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రక్రియ అమలైతే వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది.
READ MORE: ఆ మజా వేరు.. ప్రెజర్ వుంది.. హనుమాన్ కన్నా ముందే డార్లింగ్ : హీరో ప్రియదర్శి ఇంటర్వ్యూ
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
దీనిపై వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ సోషల్ మీడియా వేదికగా వివరించారు. చైనా ప్లస్ వన్ విధానంలో ప్రస్తుతం భారతదేశం తయారీ మరియు పారిశ్రామిక విప్లవం వైపు పయనిస్తోందని ఎంబి పాటిల్ అన్నారు. “ఈ పోటీ యుగంలో, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మరియు తెలంగాణ వంటి రాష్ట్రాలు మెరుగైన సహకారం అందిస్తున్నాయి. ఇందులో పాలుపంచుకోవాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాలపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కన్నడ మాట్లాడేవారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రితో చర్చించాం.
ఈ అంశంపై కూలంకషంగా చర్చించి, 100 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం కన్నడ మాట్లాడేవారి ప్రయోజనాలను కాపాడుతుందని నేను హామీ ఇస్తున్నాను. అలాగే ఇండస్ట్రీపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. రాబోయే 100 సంవత్సరాల వరకు ఇక్కడ పారిశ్రామికీకరణను కోల్పోయే అవకాశాన్ని మనం తీసుకోలేము. ఈ నిర్ణయానికి పరిశ్రమలు భయపడాల్సిన అవసరం లేదని నేను హామీ ఇస్తున్నాను.” అని పేర్కొన్నారు.
READ MORE: Amaran: దీపావళికి రిలీజ్ కాబోతున్న మరో స్టార్ హీరో సినిమా
100 శాతం రిజర్వేషన్
బిల్లుకు కర్ణాటక కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి, డి స్థాయి ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. మనది కన్నడ ఆధారిత రాష్ట్రమని, వారి ప్రయోజనాలను కాపాడడం మా మొదటి హక్కు అని ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే నిరసనలు మొదలయ్యాయి. దీనికి వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఈ నిర్ణయం కంపెనీల ఆదాయాలు, పనితీరుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. హర్యానా తరహాలో కర్ణాటక రిజర్వేషన్ల కేసు కూడా కోర్టులో కూరుకుపోతుందని న్యాయ విశ్లేషకులు భావిస్తున్నారు. హర్యానాలో ఈ రిజర్వేషన్ ప్రక్రియ అంశం కోర్టులోనే ఉంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!